స్టాక్ మార్కెట్ ఢమాల్..విలవిలలాడుతున్న ఇన్వెస్టర్లు.. తీవ్ర నష్టాల్లో ఐటీ షేర్లు..
Stock Market Today: అంతర్జాతీయ మార్కెట్లలో రోజురోజుకు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. సోమవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఒత్తిడికి గురై నష్టాల్లో పయనించాయి. విదేశీ మారక మార్కెట్‌లో తీవ్రమైన అనిశ్చితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఉదయం 10 గంటల సమయానికి.. బిఎస్‌ఈ సెన్సెక్స్ 253.68 పాయింట్లు (0.33 శాతం) క్షీణించి 76,261.75 వద్ద ట్రేడవ్వగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 సూచీ 78.70 పాయింట్లు (0.33 శాతం) పడిపోయి 23,825.60 పాయింట్ల వద్ద స్థిరపడింది.
రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ ఐటీ సూచీ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని అత్యధిక నష్టాలను నమోదు చేసింది. పతనం బాటలో ఉన్న ప్రధాన కంపెనీల్లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచాయి. మరొకవైపు రక్షణాత్మక రంగాలుగా భావించే నిఫ్టీ ఫార్మా సూచీ లాభాలను సాధించి మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చింది. విస్తృత మార్కెట్ విభాగాన్ని గమనిస్తే.. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.15 శాతం తగ్గి బలహీనతను కనబరచగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ మాత్రం ఇన్వెస్టర్ల మద్దతుతో 0.24 శాతం లాభంతో విభిన్నమైన ధోరణిని చాటుకుంది.

మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 97 డాలర్ల వద్ద స్థిరపడటమే భారత మార్కెట్లకు ప్రధాన ఆందోళనగా మారింది. వారాంతంలో మూడు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా సైనిక దాడులు జరపడం, హోర్ముజ్ జలసంధి వెంబడి ఇరాన్ నియంత్రిత రవాణా మండలాన్ని ప్రకటించడం ఇంధన సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపింది. భారతదేశం తన చమురు అవసరాలలో ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటున్నందున, ఈ ధరల పెరుగుదల దేశీయ ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, అమెరికాలో ఆగస్టు నాన్-ఫార్మ్ పేరోల్స్ నివేదికలో 16.2 మిలియన్ల ఉద్యోగాలు పెరిగినట్లు వెలువడటంతో, ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లను పెంచవచ్చనే ఊహాగానాలు బలపడి యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. దీనితో ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి టెక్ దిగ్గజాల షేర్లు పడిపోయి డౌ జోన్స్, నాస్‌డాక్ నష్టాలతో ముగిశాయి.
సెకండరీ మార్కెట్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ.. ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల సందడి కొసాగుతోంది. ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ రూ. 351.03 కోట్ల సేకరణ లక్ష్యంతో, అపనా లాజిస్టిక్స్ రూ. 34.14 కోట్ల సేకరణ కోసం సోమవారం తమ ఐపీఓలను ప్రారంభించాయి. క్వాలియన్స్ ఇంటర్నేషనల్ ఐపీఓ బిడ్డింగ్ రెండవ రోజులోకి ప్రవేశించగా ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇక ఐపీఓ ముగించుకున్న 'పర్పుల్ స్టైల్ ల్యాబ్స్' షేర్లు సోమవారం ఎక్స్ఛేంజ్‌లలో లిస్ట్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. గ్రే మార్కెట్‌లో రూ. 575 ఇష్యూ ధర కంటే తక్కువగా రూ. 565 జిఎంపి వద్ద కోట్ కావడంతో, స్టాక్ డిస్కౌంట్‌తో లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications

