స్టాక్ మార్కెట్ పతనం.. ఈ ఒక్క కారణంతో లాభాల నుంచి నష్టాల్లోకి షేర్ మార్కెట్..

ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందినప్పటికీ, పశ్చిమ ఆసియాలో మళ్లీ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎగిసిపడిన ముడి చమురు ధరల ప్రభావంతో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ ఇంట్రా-డేలో తీవ్ర లాభాల స్వీకరణకు లోనై నష్టాల్లోకి జారుకుంది. ప్రారంభంలో లాభాలతో ఉత్సాహంగా మొదలైన బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ-50లు కొద్దిసేపటికే గరిష్ఠ స్థాయిల నుంచి వేగంగా పడిపోయాయి.

బిఎస్ఈ సెన్సెక్స్ తన రోజువారీ గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 378 పాయింట్లకు పైగా క్షీణించి 78,298 స్థాయికి పడిపోగా.. నిఫ్టీ-50 కూడా 109 పాయింట్లకు పైగా క్షీణించి 24,511 స్థాయికి పరిమితమైంది. విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్‌క్యాప్-100 కొంత కోలుకుని పెరుగుదలను కనబరచగా, స్మాల్‌క్యాప్ సూచీ మాత్రం స్వల్ప నష్టాలతో ట్రేడయింది.

Sensex Today Nifty Today Stock Market Today Nifty 50 Sensex Live Nifty Below 24550 Stock Market Volatility Indian Stock Market Nifty Prediction Sensex Prediction Nifty Outlook Oil Prices Banking Stocks Midcap Stocks Share Market News August 10 2026 50 24550 10 2026

ఈరోజు మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడికి ప్రధాన కారణం పశ్చిమ ఆసియాలో చోటుచేసుకుంటున్న ఉత్కంఠ పరిణామాలే అని చెప్పవచ్చు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సంబంధించి అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేయడంతో పాటు.. అమెరికా దళాల ఉపసంహరణ, నష్టపరిహారం చెల్లింపు వంటి కఠినమైన డిమాండ్లను ఉంచడం గ్లోబల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

ఈ వార్తల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర 1 శాతం కంటే ఎక్కువ పెరిగి బ్యారెల్‌కు 84 డాలర్లు దాటింది. చమురు ధరలు పెరగడం భారతదేశం వంటి దిగుమతి ఆధారిత దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో వ్యక్తమైంది. దీనికి తోడు మార్కెట్ భయాందోళనలను సూచించే ఇండియా విక్స్ ట్రేడింగ్ సరళి రాబోయే రోజుల్లో సూచీలలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండే అవకాశాన్ని సూచిస్తోంది.

Also Read

ఈ ప్రతికూలతల నడుమ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు అర శాతానికి పైగా నష్టపోయి సూచీలను మరింత కిందకు లాగాయి. అయితే, ఐటీ, ఆటో రంగాలు సాధించిన లాభాలు మార్కెట్‌ను మరింత దారుణంగా కిందకు పడిపోకుండా అడ్డుకున్నాయి. నిఫ్టీ ఐటీ, ఆటో సూచీలు అర శాతం మేర పుంజుకుని మార్కెట్‌కు కొంత మద్దతుగా నిలిచాయి. మరోవైపు అమెరికాలో బలహీనంగా వచ్చిన జూలై ఉద్యోగ నివేదిక కారణంగా రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల పెంపు సంభవించే అవకాశాలు తగ్గడం గ్లోబల్ మార్కెట్లకు ఊరటనిచ్చింది. దీనితో పాటు, గత శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికరంగా రూ. 480.24 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం కూడా దేశీయ మార్కెట్ నష్టాలను కొంతవరకు పరిమితం చేసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+