స్టాక్ మార్కెట్ కల్లోలం.. కుప్పకూలిన రూ.44 వేల కోట్ల విలువైన కంపెనీ షేర్లు.. ఆ ఒక్క కారణమే..

మే 20, 2026న పిఐ ఇండస్ట్రీస్ స్టాక్ తన మునుపటి ముగింపు ధర రూ. 3,124.60 కంటే తక్కువగా, అంటే రూ. 2,950 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ మొదలైన వెంటనే అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఈ షేరు 7 శాతానికి పైగా పడిపోయి రూ.2,865 కనిష్ట స్థాయిని తాకింది. అయితే ఈ పతనం కేవలం ఒక్క రోజుకే పరిమితం కాలేదు. గత ఒక సంవత్సరంలో ఈ స్టాక్ సుమారు 22 శాతం నష్టపోగా, మూడేళ్ల కాలంలో పెట్టుబడిదారులకు ఎలాంటి లాభాలు ఇవ్వకపోగా దాదాపు 11 శాతం క్షీణించింది. దీన్ని బట్టి ఈ స్టాక్ చాలా కాలంగా ఒత్తిడిని ఎదుర్కొంటోందని స్పష్టమవుతోంది.

ఈ తాజా పతనానికి PI కంపెనీ ప్రకటించిన నాల్గవ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడమే ముఖ్య కారణం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,787 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం, ఈసారి 12.4 శాతం తగ్గి రూ. 1,565 కోట్లకు పడిపోయింది. అలాగే కంపెనీ నిర్వహణ లాభం (EBITDA) కూడా గత ఏడాది రూ. 456 కోట్లు ఉండగా, ఈసారి ఏకంగా 39 శాతం క్షీణించి రూ. 337 కోట్లకు పరిమితమైంది. దీంతో పాటు EBITDA మార్జిన్లు కూడా గత ఏడాది 25.5% నుండి 21.5%కి పడిపోయాయి. మార్కెట్ కనీసం 23% మార్జిన్‌ను ఆశించినప్పటికీ కంపెనీ ఆ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. నికర లాభం (PAT) విషయానికి వస్తే.. గత ఏడాది క్యూ4 లోని రూ. 331 కోట్లతో పోలిస్తే ఈసారి 39 శాతం తగ్గి రూ. 200 కోట్లుగా నమోదైంది.

PI Industries shares PI Industries stock fall PI Industries Q4 results PI Industries profit drops stock market shock today PI Industries share price quarterly earnings news PI Industries Q4 profit Indian stock market news share market updates PI Industries latest news stock market today Dalal Street news earnings season India top losing stocks PI Industries YoY profit decline market selloff today chemical sector stocks investor reaction weak quarterly earnings NSE stocks news BSE market update stock market volatility PI Industries earnings miss Indian equities news 4 4

గత తొమ్మిది త్రైమాసికాలలో ఏడింటిలో కంపెనీ మార్కెట్ అంచనాల కంటే బలహీనమైన ఫలితాలనే ఇచ్చింది. ఈ నిరంతర వైఫల్యం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని తగ్గించింది. కంపెనీకి చెందిన రెండు ప్రధాన విభాగాలు-దేశీయ వ్యాపారం, సిఎస్ఎమ్ (CSM) వ్యాపారాలు రెండూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా అగ్రోకెమికల్ (వ్యవసాయ రసాయన) పరిశ్రమలో మందగమనం, బలహీనమైన డిమాండ్ కారణంగా ఎగుమతులు 15 శాతం తగ్గాయి. మరోవైపు, దేశీయ మార్కెట్లో నిల్వలు (ఇన్వెంటరీ) ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఉత్పత్తుల ధరలపై ఒత్తిడి పెరిగి, తక్కువ ధరలకే విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల దేశీయ ఆదాయం కూడా 9 శాతం తగ్గింది. వీటితో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడిసరుకుల ఖర్చులు పెరగడం కూడా మార్జిన్లను దెబ్బతీసింది.

Also Read

ఈ కష్టకాలంలోనూ కంపెనీ యాజమాన్యం భవిష్యత్తుపై నమ్మకంతో ఉంది. ఆర్థిక సంవత్సరం 2027 ద్వితీయార్థంలో (H2FY27) పరిస్థితులు చక్కబడతాయని అంచనా వేస్తోంది. అప్పటికి వినియోగదారులు తమ ముందస్తు ప్రణాళికల ప్రకారం కొనుగోళ్లను పెంచుతారని, తద్వారా వ్యాపారం పుంజుకుంటుందని భావిస్తోంది. అంతేకాకుండా, FY27లో ఐదు కంటే ఎక్కువ కొత్త మాలిక్యూల్స్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది, ఇవి భవిష్యత్ వృద్ధికి దోహదపడతాయని నమ్ముతోంది.

కంపెనీ భవిష్యత్తు గురించి సానుకూల ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. మార్కెట్ మాత్రం ప్రస్తుతం ఉన్న బలహీనమైన గణాంకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అంతర్జాతీయంగా వ్యవసాయ రసాయన రంగంలో డిమాండ్ మళ్లీ పెరిగి, పరిశ్రమ కోలుకునే వరకు పీఐ ఇండస్ట్రీస్‌పై ఈ ఒత్తిడి ఇలాగే కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంచనాలకు భిన్నంగా ఫలితాలు చాలా బలహీనంగా రావడం వల్లే స్టాక్ ఈ స్థాయిలో పతనమైంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+