ఈ కంపెనీ షేర్లు కొన్నవారికి పండగే పండగ.. ఒక్క రోజే 156 శాతం లాభాలు..కారణం ఏంటంటే..

Stock Market Sensation: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నుండి వచ్చిన ఆశాజనక ఫలితాలు అమెరికా స్టాక్ మార్కెట్‌లో సంచలనం సృష్టించాయి. ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ సెల్లాస్ లైఫ్ సైన్సెస్ గ్రూప్ ఇంక్ (SELLAS Life Sciences Group Inc.) షేర్లు నవంబర్ 17, మంగళవారం నాడు ఒక్కరోజులోనే ఏకంగా 156 శాతం దూసుకెళ్లి 2020 తర్వాత తమ అతిపెద్ద సింగిల్-డే లాభాన్ని నమోదు చేశాయి.

ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో ఒక దశలో ఈ స్టాక్ గరిష్ఠంగా 233 శాతం మేర ఎగబాకడం గమనార్హం. తీవ్రమైన రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులలో తమ ప్రయోగాత్మక వ్యాక్సిన్ మరణ ప్రమాదాన్ని 41 శాతం తగ్గించిందని సంస్థ ప్రకటించడమే ఈ భారీ ర్యాలీకి ప్రధాన కారణమైంది.

Sellas Life Sciences Sellas Life Sciences share price Sellas Life Sciences stock Sellas Life Sciences shares up 156 pharma stocks today pharmaceutical stocks multibagger stocks stock market news shares surge today 156 percent stock rally 156

కంపెనీ వెల్లడించిన క్లినికల్ ట్రయల్ డేటా ప్రకారం.. సెల్లాస్ అభివృద్ధి చేసిన గాలిన్‌పెపిముట్-ఎస్ (Galinpepimut-S) వ్యాక్సిన్, అత్యంత ప్రమాదకరమైన రక్త క్యాన్సర్ అయిన 'అక్యూట్ మైలోయిడ్ లుకేమియా' (AML) రోగులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ చికిత్సలతో (Best Available Therapy) పోలిస్తే ఈ వ్యాక్సిన్ తీసుకున్న రోగులలో మరణ ప్రమాదం 41 శాతం మేర తగ్గింది. అంతేకాకుండా, వ్యాక్సిన్ పొందిన రోగుల సగటు ఆయుర్దాయం 24 నెలలుగా నమోదు కాగా.. ఇతర చికిత్సలు పొందిన వారి సగటు ఆయుర్దాయం 15 నెలల కంటే తక్కువగా ఉండటం వైద్య రంగంలో కొత్త ఆశలు రేకెత్తించింది.

Also Read

అయితే మంగళవారం నాటి ఈ భారీ స్టాక్ ర్యాలీ తర్వాత మార్కెట్ ముగిసిన అనంతరం (Post-Market Trading) ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. షేర్ ధర భారీగా పెరిగిన వెంటనే.. సెల్లాస్ లైఫ్ సైన్సెస్ సంస్థ 150 మిలియన్ డాలర్ల విలువైన కొత్త షేర్ల విక్రయాన్ని (Public Offering) ప్రకటించింది. జేపీ మోర్గాన్ (JPMorgan) మరియు టీడీ కోవెన్ (TD Cowen) సంస్థల ద్వారా ఈ షేర్ల విక్రయం జరగనుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే పోస్ట్-మార్కెట్ ట్రేడింగ్‌లో కంపెనీ షేరు సుమారు 12 శాతం మేర వెనక్కి తగ్గింది.

క్యాన్సర్ చికిత్సలో వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని నిరూపించే దిశగా సెల్లాస్ ఫలితాలు ఒక కీలక మైలురాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో మోడెర్నా (Moderna) మరియు మెర్క్ & కో (Merck & Co.) సంస్థలు మెలనోమా క్యాన్సర్ లక్ష్యంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగా.. ఇప్పుడు రక్త క్యాన్సర్ విషయంలోనూ సానుకూల ఫలితాలు రావడం ఆంకాలజీ రంగానికి బూస్ట్ ఇస్తోంది. మరోవైపు, స్టాక్ ధర ఇంత భారీగా పెరిగినప్పటికీ, కొందరు ట్రేడర్లు మాత్రం షేర్ ధర తిరిగి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఎస్3 పార్టనర్స్ (S3 Partners) గణాంకాల ప్రకారం, మంగళవారం నాటి ర్యాలీ తర్వాత సెల్లాస్ మొత్తం షేర్లలో సుమారు 29 శాతం మేర షార్ట్ ఇంట్రెస్ట్ (Short Interest) నమోదై ఉండటం విశేషం.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+