Stock market: స్టాక్ మార్కెట్ అవుట్‌లుక్! యుద్ధ మేఘాల మధ్య వచ్చే వారం ట్రేడింగ్ స్ట్రాటజీ ఇదే!
గత రెండు వారాల లాభాలకు భారత స్టాక్ మార్కెట్ (Stock market) (స్టాక్ మార్కెట్) బ్రేక్ వేసింది. ఈ వారం ఆరంభం బాగున్నా, వారాంతానికి వచ్చేసరికి అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు మదుపరులను కలవరపెట్టాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, క్రూడాయిల్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనివల్ల నిఫ్టీ 50 దాదాపు 1.87% నష్టపోయి 23,900 స్థాయికి దిగువన ముగిసింది. మరి వచ్చే వారం పరిస్థితి ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

వచ్చే వారం ఎలా ఉండబోతోంది?
సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ హరిప్రసాద్ కె అభిప్రాయం ప్రకారం.. వచ్చే వారం మార్కెట్ పాజిటివ్‌గా ఆరంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) దాదాపు 180 పాయింట్ల గ్యాప్-అప్ సూచిస్తోంది. అయితే, ఇది కేవలం ప్రాథమిక సంకేతం మాత్రమే. వీకెండ్‌లో అమెరికా-ఇరాన్ మధ్య చోటుచేసుకునే పరిణామాలను బట్టి సోమవారం మార్కెట్ దిశ మారుతుంది. ప్రస్తుతం మార్కెట్ "హై వోలటాలిటీ కన్సోలిడేషన్" ఫేజ్‌లోకి వెళ్తోందని, అంటే ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
మార్కెట్ ను ప్రభావితం చేసే 3 అంశాలు..
- క్రూడాయిల్ ధరలు: చమురు ధరలు స్థిరంగా ఉంటేనే మార్కెట్ కోలుకుంటుంది.
- యుద్ధంపై క్లారిటీ: భూ రాజకీయ పరిస్థితులు సద్దుమణిగితే ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుంది.
- కంపెనీల ఫలితాలు: ఇండెక్స్ హెవీవెయిట్ కంపెనీల ఎర్నింగ్స్ కూడా మార్కెట్ గమనాన్ని నిర్ణయిస్తాయి.
నిఫ్టీ, సెన్సెక్స్ కీలక స్థాయిలు (Targets & Support)..
- Sensex: సెన్సెక్స్ తిరిగి పుంజుకోవాలంటే 77,000 మార్కును దాటడం చాలా ముఖ్యం. ఇది ఇప్పుడు బలమైన రెసిస్టెన్స్‌గా మారింది. కింద వైపున 76,500 అనేది తక్షణ సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 76,000 వరకు పడిపోయే ఛాన్స్ ఉంది.
- Nifty 50: నిఫ్టీకి పైన 24,000 వద్ద గట్టి పోటీ ఉంది. ఆ తర్వాత 24,150 , 24,350 స్థాయిలు కీలకం. ఒకవేళ మార్కెట్ పడిపోతే 23,800 , 23,700 వద్ద సపోర్ట్ లభిస్తుంది. 23,500 దాటి కిందకు వెళ్తే మాత్రం అమ్మకాల ఒత్తిడి మరింత పెరగవచ్చు.
- Bank Nifty: బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం అనిశ్చితిలో ఉంది. వీక్లీ RSI 47.75 వద్ద ఉండటం వల్ల మొమెంటం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ట్రేడర్లు 57,450 పైకి వెళ్తేనే లాంగ్ పొజిషన్లు తీసుకోవడం మంచిది.
ట్రేడర్లకు ఏం చేయాలంటే..
ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ (Stock market) లో ఎవరైనా ట్రేడింగ్ చేయాలనుకుంటే కచ్చితంగా "స్టాప్ లాస్" (Strict Risk Management) పాటించాలని విశ్లేషకులు ఆకాష్ షా సూచిస్తున్నారు. మార్కెట్ దిశ క్లియర్ గా తెలిసే వరకు భారీ పొజిషన్లు తీసుకోకపోవడమే ఉత్తమం. అంతర్జాతీయంగా యుద్ధ భయాలు వెంటాడుతున్నప్పుడు మార్కెట్ ఏ క్షణంలోనైనా తలకిందులు అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ఓవర్ నైట్ పొజిషన్లు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు కేవలం గిఫ్ట్ నిఫ్టీ ఇచ్చే పాజిటివ్ సంకేతాలను మాత్రమే చూసి తొందరపడి ఇన్వెస్ట్ చేయకూడదని, స్థిరమైన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏర్పడే వరకు వేచి చూడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications