స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. వచ్చే వారం ఈ కంపెనీల స్టాక్స్ మీద ఓ కన్నేసి ఉంచండి..

Stock Market Outlook Next Week: అక్టోబర్ 16తో ముగిసిన వారంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను పంచాయి. ఉత్సాహపూరిత కొనుగోళ్ల నడుమ సెన్సెక్స్ 2.7 శాతానికి పైగా ఎగబాకగా.. నిఫ్టీ-50 సూచీ 2.8 శాతం పెరిగి 23,100 పాయింట్ల గరిష్ఠ స్థాయి పైన స్థిరపడింది. ఈ సానుకూల వాతావరణంలో వివిధ రంగాలకు చెందిన పది ప్రముఖ కంపెనీల షేర్లు భవిష్యత్తులో 15 శాతం నుండి 73 శాతం వరకు ఆకర్షణీయమైన రాబడులను ఇచ్చే అవకాశం ఉందని గ్లోబల్, స్వదేశీ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

అత్యధికంగా 73 శాతం వృద్ధి అంచనాతో విండ్ టర్బైన్ తయారీ సంస్థ సుజ్లాన్ ఎనర్జీ ఈ అంచనాలో అగ్రస్థానంలో నిలిచింది. మోతీలాల్ ఓస్వాల్.. ఈ షేరుకు రూ. 65 లక్ష్య ధరను కేటాయించింది. 5.9 గిగావాట్ల భారీ ఆర్డర్ బుక్, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కంపెనీ ఆదాయాలకు బలమైన భరోసానిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో గృహ నిర్మాణ రుణాల సంస్థ కాన్ ఫిన్ హోమ్స్ నిలిచింది. జెఫరీస్ సంస్థ ఈ స్టాక్ రూ. 1,075 టార్గెట్ ధరకు చేరుతుందని.. దాదాపు 50 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదు చేసిన రూ. 275 కోట్ల నికర లాభం ఈ అంచనాలకు బలాన్నిచ్చింది.

top 10 buy rated stocks stocks to buy this week best stocks to buy India brokerage stock recommendations stocks with upside potential 73 upside stocks Suzlon Energy share Can Fin Homes share Jubilant FoodWorks share M amp amp M stock outlook Adani Green Energy share Polycab India share Paytm share price target ICICI Prudential AMC Aditya Birla Capital Wipro stock recommendation Indian stock market news 10

డొమినోస్ పిజ్జా, పోపాయీస్‌లను నిర్వహించే జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేరు 47 శాతం మేర పెరిగి రూ. 625కి చేరుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. వినియోగదారుల వ్యయంపై ఒత్తిడి ఉన్నప్పటికీ రెస్టారెంట్ డిమాండ్ పుంజుకోవడం దీనికి దోహదపడనుంది. ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా (M&M) ఒక్కో షేరు విలువ రూ. 4 వేలకు చేరుతుందని కోటక్ ఈక్విటీస్ 40 శాతం అప్‌సైడ్‌ను అంచనా వేసింది. రాబోయే నూతన SUV విడుదలలు.. ఎం అండ్ ఎం కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి తెచ్చిపెడతాయని పేర్కొంది.

Also Read

పునరుత్పాదక ఇంధన సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు 35 శాతం వృద్ధి చెంది రూ. 1,695 లక్ష్యాన్ని చేరుకుంటుందని జెఫరీస్ విశ్లేషించింది. బ్యాటరీ శక్తి నిల్వ సామర్థ్య విస్తరణ మరియు విద్యుత్ డిమాండ్ కంపెనీకి సానుకూలంగా మారనున్నాయి. వైర్లు, కేబుళ్ల తయారీ సంస్థ పాలీక్యాబ్ ఇండియాకు జెఫరీస్ రూ. 11,040 లక్ష్య ధరను నిర్ణయిస్తూ 33 శాతం వృద్ధిని అంచనా వేసింది. రంగంలోకి కొత్త పోటీదారులు వస్తున్నప్పటికీ వ్యవస్థీకృత మార్కెట్లో పాలీక్యాబ్ ఆధిక్యత కొనసాగుతుందని భావిస్తోంది.

డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ పై నోమురా రూ. 2,250 టార్గెట్ ధరతో కవరేజీని ప్రారంభించి 32 శాతం వృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. భారత ఫిన్‌టెక్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు కంపెనీకి లాభిస్తాయిని అంచనా వేసింది. ఇక ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీపై జెఫరీస్ రూ. 3,760 టార్గెట్‌తో 28 శాతం వృద్ధిని సూచించగా, రుణాల విస్తరణ ఆధారంగా ఆదిత్య బిర్లా క్యాపిటల్ షేరు 24 శాతం పెరిగి రూ. 475కి చేరుతుందని స్పష్టం చేసింది. ఐటీ రంగానికి చెందిన విప్రోపై నోమురా రూ. 200 లక్ష్య ధరతో 15 శాతం వృద్ధిని అంచనా వేసింది. నిలకడైన నిర్వహణ మార్జిన్లు, కొత్త ఒప్పందాలు విప్రో పుంజుకోవడానికి సహాయపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+