భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. 1000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్, 22,500 దాటిన నిఫ్టీ..

Stock Market losing Bell: వరుస పతనాలతో విలవిలలాడిన భారత స్టాక్ మార్కెట్ వారంతపు ట్రేడింగ్ సెషన్‌లో అద్భుత రికవరీని సాధించి సరికొత్త ఊపిరి పీల్చుకుంది. అక్టోబర్ 8న జరిగిన అమ్మకాల భయాల నుండి తేరుకున్న ఇన్వెస్టర్లు, శుక్రవారం (అక్టోబర్ 9, 2026) కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో దలాల్ స్ట్రీట్‌లో గ్రీనరీ వెల్లివిరిసింది.

అంతర్జాతీయ మార్కెట్లలో ఉద్రిక్తతలు కొంత శమించడం, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $104 కంటే దిగువకు రావడం, ఐటీ దిగ్గజం టీసీఎస్ బలమైన ఫలితాలు విపరీతమైన ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలో బిఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) మునుపటి ముగింపుతో పోలిస్తే ఏకంగా 10000 పాయింట్లు (1.33%) ఎగబాకి 72,590 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (NSE Nifty 50) సూచీ 303.85 పాయింట్లు (1.37%) పెరిగి 22,535.65 వద్ద ముగిసింది.

Stock Market Today Sensex Jumps 879 Points Nifty Above 22500 Closing Bell October 9 2026 ITC Share Price Eicher Motors Share Price IT Stocks Rally TCS Q2 Results Indian Stock Market Market Rebound Top Gainers Today Sensex Closing Update Nifty 50 Closing Dalal Street Rally 879 22500 ITC 2

మార్కెట్ విస్తృత శ్రేణిలో భారీ లాభాలు నమోదవడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బిఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజే దాదాపు రూ. 3.64 లక్షల కోట్లు పెరిగి రూ. 465.97 లక్షల కోట్లకు చేరింది. భయాందోళనల సూచీ అయిన 'ఇండియా విక్స్' (India VIX) ఏకంగా 3.99 శాతం క్షీణించి 14.68 వద్దకు చేరడం మార్కెట్లో అస్థిరత తగ్గుతోందనే ధీమాను పెంచింది. విశాల మార్కెట్లో నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.18 శాతం లాభపడగా, స్మాల్‌క్యాప్ సూచీ కూడా సానుకూలంగా ముగిసింది.

Also Read

శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో నిఫ్టీ ఐటీ, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాలు ప్రధానంగా మార్కెట్‌ను నడిపించాయి. ముఖ్యంగా రెండవ త్రైమాసికంలో రూ. 13,884 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేరు 5.20 శాతం పెరిగి రూ. 2,184 వద్ద నిలిచి మార్కెట్ టాప్ గేైనర్‌గా నిలిచింది. దీంతో పాటు ఐషర్ మోటార్స్ (3.12%), అపోలో హాస్పిటల్స్ (3.08%), అదానీ పోర్ట్స్ (2.73%), ఇన్ఫోసిస్ (2.71%), టెక్ మహీంద్రా (2.11%), పవర్ గ్రిడ్ (2.00%) మరియు టాటా మోటార్స్ (1.90%) షేర్లు లాభాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. ఐటీ కంపెనీల విదేశీ ఆదాయ వృద్ధి మరియు ఐఐ ఆధారిత ప్రాజెక్టులు మార్కెట్ విశ్లేషకుల అంచనాలను మించి రాణించడం కలసివచ్చింది.

మరోవైపు మార్కెట్ ఉత్సాహంలోనూ కొన్ని రంగాల్లో విక్రయాల ఒత్తిడి కనిపించింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) షేరు 0.65 శాతం తగ్గి నష్టాల్లో అగ్రస్థానంలో నిలవగా, జెఎస్‌డబ్ల్యూ స్టీల్ (JSW Steel) 0.54 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) 0.41 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ పడిపోయాయి. ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ రంగాలు స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, లాభాల జోరు ముందు ఇవి ప్రభావం చూపలేకపోయాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలకు సిద్ధమని, నవంబర్ 3 మధ్యంతర ఎన్నికల వరకు సైనిక చర్య ఉండదని ప్రకటించడం వల్ల చమురు సరఫరాపై ఉన్న ఆందోళనలు తాత్కాలికంగా తగ్గాయి. అంతేకాకుండా యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం, ఆసియా మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FII) అమ్మకాల వేగానికి కళ్లెం వేశాయి. సాంకేతికంగా నిఫ్టీ 22,500 పైన స్థిరపడడం రాబోయే వారం మార్కెట్ మరింత పుంజుకోవడానికి బలమైన ప్రాతిపదికగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+