Stock Market Live News Update : నిన్నటి ఉత్సాహభరితమైన ట్రేడింగ్ సెషన్ తర్వాత భారత స్టాక్ మార్కెట్ ఈరోజు మరింత జోష్ తో ప్రారంభమైంది. నిఫ్టీ సూచీ ఉదయం నుంచే బలమైన గమనాన్ని ప్రదర్శిస్తూ దాదాపు 160 పాయింట్ల భారీ లాభాలతో ట్రేడవుతోంది. ఇండెక్స్ 25,700 మార్కును దాటి, గత 52 వారాలలో అత్యధిక స్థాయిని తాకింది. మార్కెట్‌లో బలమైన కొనుగోలు ఆసక్తి కనిపిస్తుండగా..పెట్టుబడిదారుల నమ్మకం మరోసారి పుంజుకుంది.
బ్యాంకింగ్ రంగం కూడా అదే ఉత్సాహాన్ని చూపుతోంది. నిఫ్టీ బ్యాంక్ సూచీ తన ఆల్-టైమ్ హైను అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది. ప్రైవేట్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల షేర్లు గణనీయమైన లాభాలను నమోదు చేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో బలమైన ఫండమెంటల్స్, మెరుగైన రుణ వృద్ధి, స్థిరమైన NPA స్థాయిలు పెట్టుబడిదారులకు నమ్మకాన్ని పెంచుతున్నాయి.ఇదే ఉత్సాహం సెన్సెక్స్‌లో కూడా కనిపిస్తోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా ఎగబాకగా.. 30-స్టాక్ సూచీ 84 వేల మార్కును దాటింది.

ఇది నాలుగు నెలల తర్వాత మొదటిసారి. ఈ పెరుగుదలతో, మార్కెట్ మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో ఉంది. లార్జ్‌క్యాప్ షేర్లతో పాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో కూడా గణనీయమైన కొనుగోలు కొనసాగుతోంది. విశ్లేషకుల ప్రకారం.. నేటి లాభాలకు ప్రధాన కారణం పెట్టుబడిదారుల సానుకూల దృక్పథం, గ్లోబల్ మార్కెట్లలో స్థిరత, త్రైమాసిక ఫలితాలపై ఉన్న ఉత్సాహం. మార్కెట్‌లో ముఖ్యంగా FMCG, రియాల్టీ, మెటల్ రంగాలు బలంగా నిలిచాయి.ఐటీ, బ్యాంకింగ్, మెటల్ రంగాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.ఈ ఉత్సాహం ఇంకా కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) తమ త్రైమాసిక ఫలితాలను ఈరోజు మార్కెట్ సమయాల తర్వాత ప్రకటించనుంది. మార్కెట్ హెవీవెయిట్‌గా ఉన్న రిలయన్స్ ఫలితాలు సూచీల దిశను ప్రభావితం చేయవచ్చు.ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీకి సంబంధించిన బోర్డు సమావేశం అక్టోబర్ 17న జరగనుంది.
బిజినెస్ స్టాండర్డ్ విశ్లేషణల ప్రకారం.. రిలయన్స్ ఈ త్రైమాసికంలో ఏకీకృత EBITDA వృద్ధిని సుమారు 3 శాతం మేర నమోదు చేయగలదని అంచనా. అయితే దాని చమురు అప్‌స్ట్రీమ్ వ్యాపారం (Oil exploration and production) కొంత బలహీనతను చూపవచ్చు. టెలికమ్యూనికేషన్, ఆయిల్-టు-కెమికల్ (O2C) వ్యాపారాలు బలమైన వృద్ధిని కొనసాగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫలితాలు మార్కెట్ దిశను నిర్ణయించే కీలక అంశంగా భావించబడుతున్నాయి.
అదేవిధంగా ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), హిందుస్తాన్ జింక్, పాలీక్యాబ్, హావెల్స్ ఇండియా, JSW స్టీల్, JSW ఎనర్జీ, REC, ఇండియా మార్ట్, టాటా టెక్నాలజీస్, డిక్సన్ టెక్నాలజీస్,సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సియట్ టైర్స్, LT టెక్నాలజీ సర్వీసెస్, తేజస్ నెట్‌వర్క్స్, దాల్మియా భారత్ వంటి 40కి పైగా ప్రముఖ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ ధోరణిపై మరింత ప్రభావం చూపవచ్చు.
ఇక ప్రాధమిక మార్కెట్ వైపు చూస్తే.. కెనరా HSBC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీషేర్లు ఈరోజు ప్రధాన మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. అదే సమయంలో మిడ్‌వెస్ట్ IPO సబ్‌స్క్రిప్షన్‌లకు ఈరోజు చివరి రోజు. SME విభాగంలో సిహోరా ఇండస్ట్రీస్, శ్లోక్కా డైస్, SK మినరల్స్ & అడిటివ్స్ కంపెనీల షేర్లు కూడా మార్కెట్లో లిస్ట్ అవుతాయి.
అదనంగా ఐటీ రంగం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల త్రైమాసిక ఫలితాలపై ప్రతిచర్యలు కీలకం కానున్నాయి. ఈ రెండు కంపెనీల అమెరికా-ఆధారిత ADRలు గత రాత్రి సుమారు 2.5 శాతం తగ్గడం మార్కెట్‌లో కొంత జాగ్రత్త ధోరణిని తెచ్చింది. అయినప్పటికీ దేశీయ మార్కెట్లో సానుకూల భావన బలంగా ఉంది. ఏదేమైనా నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ దశాబ్దపు కొత్త మైలురాళ్లను తాకుతున్నాయి. పెట్టుబడిదారులు ఇప్పుడు ప్రధానంగా రిలయన్స్, ఇతర హెవీవెయిట్ కంపెనీల ఫలితాలపై దృష్టి సారించారు. మార్కెట్ మూడ్ ఉత్సాహభరితంగా ఉన్నప్పటికీ, తదుపరి దిశను త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ సూచీలు నిర్ణయించనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

Paskistan: పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ! చర్చలు విఫలం కావడంతో రూ. 78,000 కోట్లు గల్లంతు! ఎలాగంటే..

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications