వచ్చే వారం స్టాక్ మార్కెట్‌కి మూడు రోజులు సెలవులు.. అయితే ఆ ఒక్క రోజు మాత్రం సాయంత్రం సెషన్ ఓపెన్..

Stock Market Holiday Calendar: పండుగ సీజన్ ప్రారంభం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో వచ్చే వారం క్రయవిక్రయాలు పరిమితంగానే జరగనున్నాయి. విజయదశమి (దసరా) పండుగతో పాటు సాధారణ వారాంతపు సెలవుల కారణంగా అక్టోబర్ 19 నుండి 25వ తేదీ మధ్య బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లలో కేవలం నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ నిర్వహించబడుతుంది. ఈక్విటీలు, డెట్, కమోడిటీలు, డెరివేటివ్‌లు, ఫారెక్స్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టే ట్రేడర్లు తమ పొజిషన్లు, కాంట్రాక్ట్ సెటిల్‌మెంట్లను ఈ సెలవుల పట్టిక ఆధారంగా ప్లాన్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

బిఎస్ఇ, ఎన్ఎస్ఇ జారీ చేసిన అధికారిక సెలవుల జాబితా ప్రకారం.. దసరా వేడుకల సందర్భంగా అక్టోబర్ 20, మంగళవారం నాడు బిఎస్ఇ, ఎన్ఎస్ఇలలో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఆ రోజు ఈక్విటీ, ఎస్ఎల్బి, డెరివేటివ్స్, కమోడిటీ మార్కెట్లు పనిచేయవు. అయితే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) మార్కెట్ అక్టోబర్ 20న ఉదయం సెషన్ (ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:00 వరకు) మూసివేసి ఉంటుంది. సాయంత్రం సెషన్ కోసం సాయంత్రం 5:00 గంటలకు పునఃప్రారంభమై రాత్రి సాధారణ సమయం వరకు కొనసాగుతుంది. ఇక అక్టోబర్ 24, 25 తేదీలు శని, ఆదివారాలు కావడం వల్ల మార్కెట్లకు యథావిధిగా సెలవు ఉంటుంది. ఫలితంగా అక్టోబర్ 19, 21, 22, 23 తేదీలలో మాత్రమే ట్రేడింగ్ సాగుతుంది.

Stock market holidays next week NSE holiday October 2026 BSE holiday October 20 stock market closed October 20 2026 October 24 stock market holiday October 25 stock market holiday Dussehra stock market holiday Sensex outlook next week Nifty outlook next week Indian stock market calendar NSE BSE trading schedule stock market news India NSE 2026 BSE 20 24

మరోవైపు గత వారంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లు బలమైన కొనుగోళ్లతో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. అక్టోబర్ 12 నుండి 16వ తేదీ మధ్య సెన్సెక్స్ ఏకంగా 2,387.26 పాయింట్లు (3.30%) ఎగబాకి 74,729.27 వద్ద ముగియగా.. నిఫ్టీ-50 సూచీ 562.80 పాయింట్లు (2.5%) పెరిగి 23,146.15 వద్ద స్థిరపడింది. శుక్రవారం ఒక్కరోజే సెన్సెక్స్ 413 పాయింట్లు లాభపడింది.

Also Read

ముడి చమురు ధరలు తగ్గడం, చమురు కంపెనీల కోసం ఆర్‌బిఐ ప్రత్యేక డాలర్ విండోను అందుబాటులోకి తెచ్చి రూపాయి విలువ క్షీణించకుండా చూడటం, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG), ఎస్‌టిటి (STT) సమీక్షపై ఆశాజనక అంచనాలు ఇన్వెస్టర్లలో ఆశావాదాన్ని నింపాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. బలమైన క్యూ2 త్రైమాసిక ఫలితాలతో ఐటీ రంగానికి చెందిన టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు ఈ ర్యాలీకి నాయకత్వం వహించాయి. అయితే ముడిసరుకుల ఖర్చులు పెరగడంతో ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలు కొంత ఒత్తిడికి లోనయ్యాయి.

రాబోయే వారంలో మార్కెట్ రికవరీ నిలకడగా ఉండాలంటే ఐటీతో పాటు ఫైనాన్షియల్స్, కన్సప్షన్ రంగాలు కూడా మెరుగైన ఫలితాలను అందించాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే భారత్ అక్టోబర్ పీఎమ్‌ఐ (PMI) డేటా, యూఎస్ నిరుద్యోగ గణాంకాలు అంతర్జాతీయంగా దిశానిర్దేశం చేయనున్నాయి. ఈక్విరస్ సెక్యూరిటీస్ క్వాంట్ అనలిస్ట్ కృతి షా ప్రకారం.. ఐటీ, ప్రైవేట్ బ్యాంకుల మద్దతుతో నిఫ్టీ వచ్చే వారాన్ని సానుకూల ధోరణితోనే ప్రారంభించనుంది. ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు, షార్ట్ కవరింగ్ దీనికి తోడయ్యాయి. రాబోయే వారంలో నిఫ్టీకి 23,400 - 23,500 స్థాయిలు కీలక నిరోధక (Resistance) ప్రాంతంగా మారనుండగా.. దిగువన 22,800 స్థాయి బలమైన మద్దతుగా (Support) నిలుస్తుందని ఆమె అంచనా వేశారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+