ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. స్టాక్ మార్కెట్ క్లోజ్ టైమ్ మారింది.. కొత్తగా క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అమల్లోకి..

భారతీయ స్టాక్ మార్కెట్ లావాదేవీల ముగింపు విధానంలో విప్లవాత్మక మార్పులు అమల్లోకి వచ్చాయి. మార్కెట్ ముగింపు సమయంలో లిక్విడిటీని కేంద్రీకరించడం, సూచీల ముగింపు ధరలపై చివరి నిమిషంలో నమోదయ్యే అనవసర హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సవరించిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఇకపై మార్కెట్ ఒకే ముగింపు సమయానికి పరిమితం కాకుండా.. మూడు వేర్వేరు సమయ పటాల ఆధారంగా పనిచేయనుంది.

కొత్త ముగింపు సమయం వివరాలు (Timelines):

1. F&O స్టాక్స్ నిరంతర ట్రేడింగ్: మధ్యాహ్నం 3:15 గంటలకు ముగుస్తుంది.
2. నార్మల్ స్టాక్స్ ట్రేడింగ్: F&O పరిధిలోకి రాని సాధారణ షేర్ల ట్రేడింగ్ యథావిధిగా మధ్యాహ్నం 3:30 గంటల వరకు కొనసాగుతుంది.
3. డెరివేటివ్స్ ట్రేడింగ్: ఇండెక్స్, స్టాక్ డెరివేటివ్స్ (F&O) కాంట్రాక్టుల ట్రేడింగ్ మధ్యాహ్నం 3:40 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

Stock Market Timings NSE Trading Hours BSE Trading Hours Indian Stock Market Market Closing Time NSE Closing Time BSE Closing Time Stock Market News Trading Session Share Market Timings SEBI Equity Market Investors Business News India Stock Market NSE BSE NSE BSE

క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) ఎలా పనిచేస్తుంది?
ప్రస్తుతం షేరు ముగింపు ధరను నిర్ణయించడానికి చివరి 30 నిమిషాల 'వాల్యూమ్-వెయిటెడ్ యావరేజ్ ప్రైస్' (VWAP) ను ఉపయోగిస్తున్నారు. అయితే కొత్త CAS ఫ్రేమ్‌వర్క్‌లో F&O స్టాక్స్ ముగింపు ధర నిర్ణయం క్రింది దశలలో సాగుతుంది:

3:00 PM - 3:15 PM: ఈ 15 నిమిషాల ట్రేడింగ్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ ప్రతి స్టాక్‌కు రిఫరెన్స్ VWAP ని లెక్కిస్తుంది.
3:15 PM - 3:20 PM (ట్రాన్సిషన్ వ్యవధి): సాధారణ ట్రేడింగ్ ఆగిపోతుంది. ఈ 5 నిమిషాల్లో కొత్త ఆర్డర్లకు అనుమతి ఉండదు. సాధారణ ట్రేడింగ్‌లోని లిమిట్ ఆర్డర్లు వేలంలోకి బదిలీ అవుతాయి. కానీ స్టాప్‌లాస్, ఐస్‌బర్గ్ ఆర్డర్లు, రిఫరెన్స్ ధరకు ±3% పరిధి వెలుపల ఉన్న ఆర్డర్లు రద్దవుతాయి.
3:20 PM - 3:25 PM: పెట్టుబడిదారులు మార్కెట్, లిమిట్ ఆర్డర్లను నమోదు చేయవచ్చు.

స్టాక్ మార్కెట్ క్లోజింగ్ బెల్.. భారీగా లాభాలను పోగేసుకున్న ఇన్వెస్టర్లు.. వరుసగా 4వ రోజు స్టాక్ మార్కెట్ జోష్
3:25 PM - 3:30 PM: కేవలం లిమిట్ ఆర్డర్ల ఎంట్రీకి మాత్రమే అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 3:28 నుండి 3:30 గంటల మధ్య ఏదో ఒక యాదృచ్ఛిక (Random) సమయంలో ఆర్డర్ ఎంట్రీ ఆగిపోతుంది.
3:30 PM - 3:35 PM: సమర్పించిన అన్ని అర్హత గల ఆర్డర్లను సిస్టమ్ మ్యాచ్ చేసి, గరిష్ట పరిమాణంలో షేర్లు ట్రేడ్ అయ్యే ఒకే "సమతుల్య ధర" (Equilibrium Price) ను సృష్టిస్తుంది. అదే ఆ రోజు అధికారిక ముగింపు ధరగా స్థిరపడుతుంది.

న్యూయార్క్, లండన్ వంటి ప్రధాన అంతర్జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఇప్పటికే ఈ వేలం విధానం అమల్లో ఉంది. పాసివ్ ఫండ్లు, ఇండెక్స్ ఫండ్లు రోజు ముగింపులో పెద్ద ఎత్తున జరిపే కొనుగోళ్లు-అమ్మకాల వల్ల మార్కెట్ అసమతుల్యతకు గురికాకుండా ఉండటానికి ఈ సిస్టమ్ దోహదపడుతుంది. తొలి దశలో ఈ CAS కేవలం F&O పరిధిలోని స్టాక్స్‌కు మాత్రమే వర్తిస్తుందని, మిగిలిన సెక్యూరిటీలు పాత పద్ధతిలోనే క్లోజ్ అవుతాయని ఎక్స్ఛేంజ్ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+