స్టాక్ మార్కెట్ క్లోజింగ్ బెల్.. భారీ నష్టాల నుంచి తృటిలో తప్పించుకున్న షేర్ మార్కెట్..

Stock Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడవ వారం లాభాలతో ముగిసి సానుకూల జోరును కొనసాగించాయి. జూన్ 2026 తర్వాత వరుసగా మూడు వారాల పాటు మార్కెట్ లాభాల్లో నిలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

అయితే వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం నాడు లాభాల స్వీకరణ, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల కారణంగా మార్కెట్‌లోకి అమ్మకాల ఒత్తిడి తిరిగి వచ్చింది. ఫలితంగా శుక్రవారం ముగింపులో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 81,592 వద్ద స్థిరపడగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 155 పాయింట్లు క్షీణించి 25,200 కీలక మద్దతు స్థాయి కంటే దిగువన 25,144 వద్ద ముగిసింది.

Indian stock market today Sensex down 319 points Nifty falls 155 points weekly market highlights stock market weekly gains consecutive weekly gains Sensex Nifty closing Friday market sell-off Indian market weekly wrap stock market November 13 2026 319 155

వారపు ప్రాతిపదికన చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు మార్కెట్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 8 శాతం మేర ఎగబాకగా.. బ్యాంక్ నిఫ్టీ 3 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇందుకు భిన్నంగా ఐటీ రంగం తీవ్ర బలహీనతను ప్రదర్శించి 3 శాతానికి పైగా పడిపోయింది.

ఈ వారంలో నిఫ్టీ దిగ్గజాల్లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బీఎస్‌ఈ, బజాజ్ ఫిన్‌సర్వ్, ట్రెంట్ షేర్లు అత్యధికంగా లాభపడగా.. గ్రాసిమ్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల జాబితాలో నిలిచాయి. చిన్న, మధ్య తరహా కంపెనీలలో కళ్యాణ్ జ్యువెలర్స్, పీబీ ఫిన్‌టెక్, హిటాచీ ఎనర్జీ, డేటా ప్యాటర్న్స్, పీఎన్‌బీ, సిమెన్స్ ఎనర్జీ షేర్లు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను పంచాయి.

Also Read

అయితే వారం చివరి రోజున మార్కెట్లో విస్తృత స్థాయిలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీలోని 50 షేర్లలో ఏకంగా 39 షేర్లు నష్టాల్లో ముగియగా, అందులో 18 షేర్లు ఒక శాతానికి పైగా క్షీణించాయి. మార్కెట్ బ్రెడ్త్ 2:3 నిష్పత్తిలో ప్రతికూలంగా నమోదైంది. శుక్రవారం నాడు బ్యాంక్ నిఫ్టీ 484 పాయింట్లు తగ్గి 61,034 వద్ద, మిడ్‌క్యాప్ సూచీ 150 పాయింట్లు పడిపోయి 61,890 వద్ద ముగిశాయి.

కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు మరియు ఇతర పరిణామాలు పలు షేర్ల కదలికలను ప్రభావితం చేశాయి. ఫలితాల ప్రకటనకు ముందు ఐషర్ మోటార్స్ నిఫ్టీలో టాప్ గెయినర్‌గా నిలవగా, భారతీ ఎయిర్‌టెల్ దాదాపు 1 శాతం పెరిగింది. మరోవైపు, ఆదాయ మార్జిన్లు అంచనాల కంటే తక్కువగా ఉండటంతో గ్రాసిమ్ షేరు 2 శాతానికి పైగా పతనమైంది. ఫలితాలకు ముందు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ 3 శాతం నష్టపోయింది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో విమానయాన, పెయింట్, చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు ఒత్తిడికి లోనై ఇండిగో 1 శాతం, హెచ్‌పీసీఎల్ 2 శాతం చొప్పున తగ్గాయి. బంగారం ధరలు దిగిరావడంతో ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ షేర్లు 3 శాతం మేర క్షీణించగా.. అధిక మార్కెటింగ్ ఖర్చుల ఆందోళనతో వొడాఫోన్ ఐడియా కూడా 3 శాతం పడిపోయింది.

ఇదే సమయంలో క్యాపిటల్ గూడ్స్, భారీ యంత్రాల తయారీ రంగాల్లో మాత్రం కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. బలమైన కొత్త ఆర్డర్ల నేపథ్యంలో హిటాచీ ఎనర్జీ 11 శాతం, మెరుగైన ఆదాయ వృద్ధితో అంబర్ ఎంటర్‌ప్రైజెస్ 9 శాతం, ఏఐ సంబంధిత డిమాండ్‌తో జీఈ వెర్నోవా టీ&డీ మరియు పీబీ ఫిన్‌టెక్ షేర్లు 5 శాతం చొప్పున లాభపడి మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+