స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. నిర్మలమ్మ ఒక్క ప్రకటనతో పరుగులు పెట్టిన బుల్స్..

Stock Market Closing Bell: మంగళవారం నాటి ట్రేడింగ్‌లో భారత ఈక్విటీ మార్కెట్లు అపూర్వమైన రికవరీని ప్రదర్శించాయి. ఆరంభంలో నష్టాలతో ప్రారంభమైనప్పటికీ.. మధ్యాహ్నం సెషన్ నాటికి కొనుగోళ్లు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్ను, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) సమీక్షపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లో కొత్త ఆశలు రేకెత్తించాయి.

దీనికి తోడు హెవీవెయిట్ ఐటీ స్టాక్స్ దాడి, రూపాయి బలపడటం, గ్లోబల్ ఆయిల్, బాండ్ దిగుబడులు తగ్గడం మూలంగా బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. మధ్యాహ్నం 02:58 గంటల సమయానికి సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా ఎగబాకి 72,900 స్థాయిని దాటగా, నిఫ్టీ 300 పాయింట్లు పెరిగి 22,700 పాయింట్ల పైన స్థిరపడింది. ఈ ఊరట ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఒకేరోజు రూ. 3 లక్షల కోట్లకు పైగా పెరిగి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 469 లక్షల కోట్లకు చేరుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ చేసిన ప్రకటనతో పాటుగా మార్కెట్ ని కొన్ని అంశాలు పరుగులు పెట్టించాయి.

1100 22700 2026 50 HCLTech TCS Stock Market Closing Bell October 13 2026 Sensex jumps 1100 points Nifty above 22700 Indian stock market today Sensex closing update Nifty 50 closing IT stocks rally HCLTech

'బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్'లో పాల్గొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఈక్విటీలపై ఎల్‌టిసిజీ (LTCG) పన్ను, ఎస్టీటీ (STT) మార్పులపై సార్వభౌమ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల అభిప్రాయాలను వింటున్నామని, వివిధ ఆస్తి వర్గాల పన్నులపై విస్తృత చర్చ జరుగుతోందని వెల్లడించారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FII) నిరంతర ఉపసంహరణల వేళ ఎస్‌బిఐ రీసెర్చ్ తన 'ఎకోరాప్' నివేదిక ద్వారా ఎల్‌టిసిజీని తొలగించాలని చేసిన ప్రతిపాదనలకు ఈ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి.

Also Read

గ్లోబల్ మార్కెట్లలో ఏఐ (AI) స్టాక్స్ బబుల్ భయాలతో దక్షిణ కొరియా కోస్పి (KOSPI) 6 శాతానికి పైగా పడిపోగా, జపాన్ నిక్కీ 2 శాతం దిగజారింది. ఈ భయాల నేపథ్యంలో ఐటీ అవుట్‌సోర్సింగ్ ఆధారిత భారతీయ టెక్ దిగ్గజాలకు 'యాంటీ-ఏఐ ట్రేడ్'గా పెట్టుబడులు పెరిగాయి. మెరుగైన క్యూ2 ఫలితాల అంచనాలతో హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech), టీసీఎస్ (TCS) చెరో 5 శాతానికి పైగా దూసుకెళ్లగా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు 3 శాతం మేర లాభపడ్డాయి.

డాలర్‌తో పోలిస్తే కరెన్సీ పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శనివారం, సోమవారాల్లో ప్రకటించిన అసాధారణ నియంత్రణ చర్యలు రసవత్తర ఫలితాలనిచ్చాయి. ఫారెక్స్ డెరివేటివ్స్ పరిమితులు, చమురు కంపెనీలకు ప్రత్యేక డాలర్ విండో మరియు 20 శాతం నగదు నిల్వల నిబంధనల వల్ల స్పాట్ మార్కెట్‌లో ఊహాజనిత కొనుగోళ్లు తగ్గి, రూపాయి విలువ ఒకేరోజు 82 పైసలు పెరిగి డాలర్‌తో పోలిస్తే 94.96 వద్దకు బలంగా కోలుకుంది.

యూఎస్ 10-సంవత్సరాల బాండ్ దిగుబడులు 5.2 శాతానికి దిగువకు, రెండేళ్ల దిగుబడులు 4.8 శాతానికి తగ్గడం ఈక్విటీల నుంచి నిధుల తరలింపునకు బ్రేక్ వేసింది. అలాగే, రష్యన్ డీజిల్ సరఫరాలపై ఆంక్షల సడలింపు వ్యాఖ్యల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1 శాతం తగ్గి బ్యారెల్‌కు $105 డాలర్లకు పడిపోవడం భారత స్థూల ఆర్థిక రంగానికి ఊరటనిచ్చింది.

రంగాలు, షేర్ల పరంగా నిఫ్టీ ఐటీ ఏకంగా 3 శాతానికి పైగా లాభపడగా.. FMCG, రియల్టీ సూచీలు 1 శాతం లాభపడ్డాయి. ఫార్మా రన్ మాత్రం ప్రతికూలంగా ముగిసింది. ట్రెండ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్, బాటా, ఎస్‌బిఐ 2 శాతం వరకు లాభపడగా, ఎన్‌టిపిసి (NTPC) 1 శాతం నష్టంతో టాప్ లూజర్‌గా నిలిచింది. అయితే, మార్కెట్ బ్రెడ్త్ ఇంకా ప్రతికూలంగానే ఉంది (1,400 షేర్లు లాభాల్లో, 1,638 షేర్లు నష్టాల్లో). టెక్నికల్ కోణంలో నిఫ్టీ ఓవర్‌సోల్డ్ జోన్ నుంచి కోలుకున్నప్పటికీ, 22,500-22,600 నిరోధక స్థాయిలను దాటే వరకు, ఎఫ్‌ఐఐల విక్రయాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని, రూ. 22,300 కీలమైన తక్షణ మద్దతుగా పనిచేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+