స్టాక్ మార్కెట్‌ క్లోజింగ్ బెల్.. ఇన్వెస్టర్ల కొంపలు ముంచింది అదొక్కటే.. భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్..

Stock Market Closing Bell: అంతర్జాతీయ ఇంధన విపణిలో భగ్గుమంటున్న ముడి చమురు ధరలు, హార్ముజ్ జలసంధి వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చెలరేగుతున్న తీవ్ర యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చాయి. గురువారం (అక్టోబర్ 22) నాటి విక్రయాల పరంపరతో దేశీయ ఈక్విటీ సూచీలు వరుసగా మూడో సెషన్‌లోనూ భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,700 కీలక స్థాయి దిగువకు పడిపోయింది.

అధికారిక ముగింపు గణాంకాల ప్రకారం.. బిఎస్‌ఈ సెన్సెక్స్ 460.30 పాయింట్లు (0.62 శాతం) క్షీణించి 73,249.39 వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 123.70 పాయింట్లు (0.54 శాతం) నష్టపోయి 22,687.65 వద్ద ముగిసింది. మార్కెట్ వ్యాప్తంగా విస్తృతమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బిఎస్‌ఈలో సుమారు 1,323 షేర్లు మాత్రమే లాభపడగా, ఏకంగా 2,670 షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మరో 155 షేర్ల ధరల్లో మార్పు లేదు. ఈ క్రమంలో నిఫ్టీలో నెస్లే ఇండియా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు అత్యధికంగా నష్టపోగా.. బజాజ్ ఫైనాన్స్, సిప్లా, ఎస్‌బిఐ, బజాజ్ ఆటో, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

Stock Market Closing Today Closing Bell October 22 2026 Sensex Today Nifty 50 Today Sensex Down 460 Points Nifty Below 22700 Stock Market Crash Indian Stock Market News Auto Stocks FMCG Stocks IT Stocks Dalal Street Share Market Today Stock Market Fall Reasons Sensex Nifty Closing

రంగాల వారీగా పరిశీలిస్తే ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ & గ్యాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఎనర్జీ, ఎఫ్‌ఎమ్‌సిజి సూచీలు 0.5 శాతం నుండి 1.7 శాతం మేర పడిపోయాయి. అత్యధికంగా మీడియా సూచీ ఏకంగా 2.3 శాతం కుప్పకూలింది. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు చెరో 1 శాతం చొప్పున నష్టపోయాయి.

Also Read

ట్రేడింగ్ ఆరంభంలో నిఫ్టీ కొలుకుని లాభాల వైపు ప్రయాణించేందుకు గట్టిగానే యత్నించినప్పటికీ, రోజు గడిచేకొద్దీ అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో ఒక్కసారిగా 200 పాయింట్లు పడిపోయి 22,631 ఇంట్రాడే కనిష్టానికి చేరింది. ఈ తాజా పతనంతో బిఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ నుండి ఒక్కరోజే సుమారు రూ. 3,83,881.16 కోట్లు ఆవిరైపోయాయి.

మార్కెట్లను ముంచెత్తిన గ్లోబల్ భయాలు..

1. క్రూడ్ ఆయిల్ విపరీత పెంపు: పశ్చిమ ఆసియాలో భద్రతా అస్థిరతల కారణంగా బ్రెంట్ ముడి చమురు ధర 2.5 శాతానికి పైగా ఎగబాకి బ్యారెల్‌కు ఏకంగా $111.62 డాలర్లకు చేరుకుంది. ప్రధాన దిగుమతి దారైన భారత్‌కు ఇది ద్రవ్యోల్బణ సవాలును, కార్పొరేట్ నిర్వహణ వ్యయాలను పెంచుతుందనే భయాలు ఇన్వెస్టర్లను విక్రయాల వైపు నెట్టాయి.
2. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు అమెరికా సైనిక భద్రత కల్పిస్తే, ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడతామని ఇరాన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. కొన్ని నౌకల ప్రయాణాన్ని ఇరాన్ చట్టవిరుద్ధంగా ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది.
3. సౌదీలో డ్రోన్ దాడులు & అమెరికా ఫ్యూచర్స్ క్షీణత: సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు రియాద్ ప్రాంతంలో మరో డ్రోన్‌ను అడ్డగించి కూల్చివేసినట్లు ప్రకటించాయి. గల్ఫ్‌లో క్రమంగా పెరుగుతున్న సైనిక ఘర్షణలతో అమెరికా మార్కెట్ సంకేతాలు బలహీనపడ్డాయి. ఫలితంగా డౌ ఫ్యూచర్స్ (Dow Futures) 226 పాయింట్లు (0.43%) పడిపోయి 52,833 వద్దకు చేరడం భారత విపణిని మరింత ఒత్తిడికి గురిచేసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+