స్టాక్ మార్కెట్ క్లోజింగ్ బెల్.. షేర్ మార్కెట్లో రక్తపాతం.. రూ. 6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి..

Stock Market Closing Bell: సోమవారం (నవంబర్ 23, 2026) మధ్యాహ్నం సెషన్‌లో భారత స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో కుదేలయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత తలెత్తిన తీవ్ర అమ్మకాలతో ప్రధాన సూచీలు భారీ నష్టాలలోకి జారుకున్నాయి. మధ్యాహ్నం 3:02 గంటల సమయానికి సెన్సెక్స్ (Sensex) 1,436.75 పాయింట్లు (1.71 శాతం) క్షీణించి 82,482.96 వద్దకు చేరగా.. నిఫ్టీ (Nifty) 429.30 పాయింట్లు (1.66 శాతం) నష్టపోయి 25,371.30 వద్ద ట్రేడైంది.

ఈ భారీ పతనంతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం ముగింపు నాటి రూ. 5,15,32,706.59 కోట్ల (సుమారు రూ. 515.33 లక్షల కోట్ల) నుండి రూ. 5,09,99,913.05 కోట్లకు పడిపోయింది. దీనివల్ల మదుపర్ల సంపదలో సుమారు రూ. 5.33 లక్షల నుండి రూ. 6 లక్షల కోట్ల వరకు ఆవిరైంది.

Stock Market Closing Bell Sensex Today Nifty Today Sensex Falls 1430 Points Nifty Below 25400 Indian Stock Market Crash Share Market Closing Today Dalal Street Selloff Stock Market News Today Sensex Nifty Fall Investor Wealth Loss Indian Market Closing 1430 25400

మార్కెట్లో విస్తృత స్థాయిలో బలహీనత కనిపించింది. బీఎస్ఈలో ట్రేడ్ అయిన మొత్తం 4,509 షేర్లలో 1,547 షేర్లు లాభపడగా.. 2,692 షేర్లు నష్టపోయాయి. 270 షేర్లు యథాతథంగా నిలిచాయి. నిఫ్టీలో అడ్వాన్స్-డిక్లైన్ నిష్పత్తి 16:34గా నమోదైంది. మొత్తం 213 షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకగా.. 167 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లోకి చేరాయి; 122 షేర్లు 52 వారాల గరిష్ఠాలను తాకగా, అంతకంటే ఎక్కువగా 129 షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి.

Also Read

రంగాల వారీగా చూస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలు బ్యాంక్ నిఫ్టీని కిందకు లాగాయి. అదేవిధంగా టాటా స్టీల్, లోహ రంగాల పతనం సూచీలపై ఒత్తిడి పెంచగా.. నిఫ్టీ ఐటీ (Nifty IT) ఇండెక్స్ మాత్రం భిన్నంగా నిలిచి 1 శాతానికి పైగా లాభపడింది.

కమోడిటీ, కరెన్సీ మార్కెట్లలోనూ కీలక కదలికలు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో డబ్ల్యూటీఐ (WTI) ముడి చమురు ధర సుమారు 0.5 శాతం తగ్గి 83.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు రూపాయి విలువ ట్రేడింగ్ మధ్యలో గరిష్ఠ స్థాయి నుండి సుమారు 50 పైసలు క్షీణించి 92.94 వద్దకు జారినప్పటికీ, ఆ తర్వాత కొంత కోలుకుని డాలర్‌తో పోలిస్తే 92.56 వద్ద స్థిరపడింది. అయినప్పటికీ ఇటీవలి బలహీన ధోరణిని కొనసాగించింది.

వరుసగా నాలుగు వారాల ర్యాలీ తర్వాత గరిష్ఠ స్థాయిల వద్ద లాభాల స్వీకరణ, అమెరికా (నాస్‌డాక్ కాంపోజిట్ 5% పైగా పతనం)తో పాటు దక్షిణ కొరియా కోస్పి (ఒకానొక దశలో 5.5% క్షీణత; ఎస్‌కే హైనిక్స్ 16%, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ 5% నష్టం), హాంగ్ సెంగ్ (వరుసగా ఐదో సెషన్‌లో 7% పతనం), చైనా మార్కెట్లలో అమ్మకాల సెగ దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+