ఇన్వెస్టర్లకు భారీ షాక్.. వరుసగా రెండో రోజు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.8.93 లక్షల కోట్లు హాంఫట్

Stock Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్ సూచీలలో అనిశ్చితి తీవ్రరూపం దాల్చింది. బుధవారం (అక్టోబర్ 21) నాటి ట్రేడింగ్‌లో సూచీలు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలతో ముగిశాయి. రోజంతా తీవ్రమైన హెచ్చుతగ్గుల నడుమ సాగిన ట్రేడింగ్‌లో చివరికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22,850 కీలక స్థాయి కంటే దిగువకు పడిపోయింది.

మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్‌ఈ సెన్సెక్స్ 143.21 పాయింట్లు (0.19 శాతం) క్షీణించి 73,709.69 వద్ద స్థిరపడగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 77.60 పాయింట్లు (0.34 శాతం) నష్టపోయి 22,811.35 వద్ద ముగిసింది. స్టాక్ విపణిలో మొత్తం 884 షేర్లు లాభపడగా, ఏకంగా 3,361 షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. మరో 157 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Stock Market Crash Stock Market Today Sensex Today Nifty 50 Today Nifty Below 22850 Stock Market Fall Today Share Market Crash Investors Wealth Loss Rs 8 93 Lakh Crore Loss Indian Stock Market News Stock Market Live Updates Sensex Nifty Crash Dalal Street Selloff Share Market News Telugu Nifty Support Levels Stock Market October 21 2026 50 22850

ఉదయం ఆరంభంలో మార్కెట్ సానుకూల సంకేతాలతో బలంగానే ప్రారంభమైనప్పటికీ.. ఉదయం 11:35 గంటల సమయానికి పరిస్థితి తలక్రిందులైంది. ఒకసారి మొదలైన విక్రయాల పరంపర రోజంతా కొనసాగడంతో ఇంట్రాడే గరిష్ఠాల నుండి సెన్సెక్స్ ఏకంగా 1,200 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు నష్టపోయాయి.

ఈ పతనం కారణంగా అక్టోబర్ 19, 21 మధ్య కేవలం రెండు ట్రేడింగ్ రోజుల్లోనే బిఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,68,51,452.069 కోట్ల నుండి రూ. 4,59,58,295.01 కోట్లకు పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు సుమారు రూ. 8.93 లక్షల కోట్ల (1.9 శాతం) సంపదను కోల్పోయారు. ఈ అక్టోబర్ నెలలో ఇప్పటివరకు చూస్తే మార్కెట్ విలువ ఏకంగా రూ. 12 లక్షల కోట్లకు పైగా క్షీణించడం గమనార్హం.

Also Read

మార్కెట్ తీవ్ర పతనానికి ఈ ఐదు ప్రధాన అంశాలే కారణం..

మొదటిది ఏంటంటే.. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లు దాటడం. భారతదేశం తన చమురు అవసరాలలో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటున్నందున, చమురు మంట ద్రవ్యోల్బణాన్ని పెంచి కంపెనీల నిర్వహణ ఖర్చులను తీవ్రం చేస్తుందనే ఆందోళన ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది.

రెండవది ఏంటంటే.. ఉదయం లాభాల్లో ప్రారంభమైన వేళ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపడం.

మూడవ కారణం ఏంటంటే.. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలో 750 పాయింట్లు పడిపోవడం ద్వారా బ్యాంకింగ్ రంగంపై విపరీతమైన అమ్మకాల ఒత్తిడి పెరగడం.

నాలుగవది ఏంటంటే.. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1,100 పాయింట్లు కోల్పోవడం. ఇన్వెస్టర్లు అధిక రిస్క్ ఉండే చిన్న, మధ్య తరహా కంపెనీల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని ఇది స్పష్టం చేస్తోంది.

ఐదవ కారణం ఏంటంటే.. ప్రస్తుతం కొనసాగుతున్న కార్పొరేట్ ద్వితీయ త్రైమాసిక (Q2) ఫలితాల అనిశ్చితి, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను తీవ్రంగా కలవరపెడుతున్నాయి.

రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, ఎటర్నల్, బీఎస్ఈ, బజాజ్ ఆటో వంటి హెవీవెయిట్ షేర్లు ప్రధానంగా నష్టపోగా, ఐటీ రంగానికి చెందిన ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తో పాటు అల్ట్రాటెక్ సిమెంట్ లాభాల్లో ముగిశాయి. ఐటీ ఇండెక్స్ 2.5 శాతం మేర పుంజుకోగా; ఆటో, ఎఫ్‌ఎమ్‌సిజి, ఇంధనం, మీడియా, మెటల్, ఫార్మా, రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు 1 నుండి 2 శాతం వరకు క్షీణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు చెరో 2 శాతానికి పైగా నష్టపోయాయి.

చార్ట్ సాంకేతిక అంశాల ప్రకారం.. నిఫ్టీ ప్రస్తుతం 23,100 వద్ద బలమైన నిరోధాన్ని (Resistance) ఎదుర్కొంటోంది. మార్కెట్ మళ్లీ రికవరీ సాధించాలంటే నిఫ్టీ ఈ స్థాయి పైన స్థిరంగా నిలబడటం అవసరం. బజాజ్ బ్రోకింగ్ నిపుణుడు పబిత్రో ముఖర్జీ ప్రకారం.. సూచీ 23,175 పైన స్థిరపడితే మళ్లీ 23,500 వైపు పయనించే అవకాశం ఉందన్షారు. ఒకవేళ బలహీనత మరింత పెరిగి 22,800 కంటే దిగువకు దిగజారితే మాత్రం 22,600-22,500 స్థాయిలు కీలకమైన మద్దతుగా (Support) నిలుస్తాయని పేర్కొన్నారు. అలాగే కోటక్ నియోకి చెందిన శ్రీకాంత్ చౌహాన్ స్వల్పకాలిక ట్రేడింగ్ సెంటిమెంట్ కోసం 22,750 స్థాయిని అత్యంత కీలకమైన పాయింట్‌గా సూచించారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+