చివరి గంటలో కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఈ రెండు కారణాలతో ఇన్వెస్టర్లు డబ్బు హాం ఫట్..

Stock Market Closing Bell: ఈ వారంలో రెండో ట్రేడింగ్ సెషన్‌లో భారత స్టాక్ మార్కెట్ తీవ్ర తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురైంది. మంగళవారం ఉదయం పూట కనిష్ట స్థాయిల నుంచి వేగంగా కోలుకుని లాభాల్లోకి వెళ్లిన బెంచ్‌మార్క్ సూచీలు.. మధ్యాహ్న సమయానికి తమ ఇంట్రాడే గరిష్టాల నుంచి భారీగా జారిపోయాయి. బిఎస్ఇ సెన్సెక్స్ తన రోజువారీ గరిష్ట స్థాయి 77,231 పాయింట్ల నుండి ఏకంగా 550 పాయింట్లు పతనమై 76,670 స్థాయికి చేరుకుంది. మరోవైపు ఎన్ఎస్ఇ నిఫ్టీ-50 కూడా గరిష్ట స్థాయి 24,143 నుండి కీలకమైన 24,000 సైకలాజికల్ మద్దతు స్థాయి కంటే దిగువకు పడిపోయింది.

పశ్చిమ ఆసియాలో అమెరికా- ఇరాన్ మధ్య ముదురుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా రవాణాకు ఆటంకం కలుగుతుందనే భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 92 డాలర్లు దాటింది. అధిక ఇంధన ధరలు భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలలో ద్రవ్యోల్బణాన్ని.. రూపాయిపై ఒత్తిడిని పెంచుతాయనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి.

stock market today September 1 2026 Sensex closing today Nifty closing today crude oil prices crude oil impact on Indian stock market Maruti Suzuki share price Maruti shares fall 4 percent Sensex Nifty today stock market closing Indian stock market oil price fears auto stocks today Nifty closing September 1 Dalal Street today 1 2026

దీనికి తోడు జపాన్ 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ ఈల్డ్ 1996 తర్వాత తొలిసారిగా 3 శాతం రికార్డు స్థాయిని తాకడం.. యెన్ కరెన్సీ డాలర్‌తో పోలిస్తే 160 వద్ద ట్రేడ్ కావడం గ్లోబల్ మార్కెట్లను కలవరపెడుతోంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా సాగిన 'యెన్ క్యారీ ట్రేడ్' ముగింపు దిశగా సాగుతోంది. దీనివల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ల నుండి నిధులను వెనక్కి మళ్లించే ప్రమాదం కనిపిస్తోంది.

Also Read

ఆగస్టు నెల వాహన విక్రయ గణాంకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆటో రంగానికి చెందిన షేర్లు తీవ్ర విక్రయ ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ అత్యధికంగా దాదాపు 2 శాతం క్షీణించింది. వీటితో పాటు నిఫ్టీ బ్యాంక్, రియల్టీ, ఫార్మా రంగాలు 1.5 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. మార్కెట్ నష్టాల్లో మునిగినప్పటికీ, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ రంగాలు కొనుగోళ్ల మద్దతును చూసాయి.

మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి నిఫ్టీ-50 ప్యాక్‌లోని 34 స్టాక్స్ నష్టాల్లోన్, 16 స్టాక్స్ లాభాల్లోనూ ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్ 5 శాతం కంటే ఎక్కువ నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. బలహీన సేల్స్ డేటాతో మారుతి సుజుకి 4.8 శాతం, ఇండిగో మరియు నెస్లే ఇండియా 3.7 శాతం వరకు క్షీణించాయి. మరోవైపు ఐటీసీ (ITC) 4.4 శాతం పెరిగి సూచీలకు కొంత ఊరటనిచ్చింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+