వచ్చే వారం స్టాక్ మార్కెట్‌ని ఊపేయనున్న 5 ఐపీఓలు..అతి పెద్ద కంపెనీ IPO ఏదంటే..
వచ్చే వారం భారతీయ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులకు భారీ స్థాయిలో ఐపీఓలు సందడి చేయనున్నాయి. మొత్తం 5 కొత్త ప్రాథమిక షేర్ల అమ్మకాల(IPO)తో పాటు, 9 కంపెనీలు మార్కెట్‌లో తమ షేర్లను సెబీలో లిస్ట్ చేయనున్నాయి.అయితే వచ్చే వారం మెయిన్‌బోర్డ్ సెగ్మెంట్‌లో ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ ఐపీఓ ఒకటే ఉంది.
విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ఆహార సేవలు అందించే ఈ సంస్థ రూ. 2వేల కోట్ల విలువైన ఐపీఓను జూలై 7న ప్రారంభించి.. జూలై 9న ముగించనుంది. ఒక్కో షేరు ధరను రూ. 1,045 నుండి రూ. 1,100 వరకు నిర్ణయించారు. కనీసంగా పెట్టుబడిదారుడు 13 షేర్ల లాట్ కొనాలి. షేరు కేటాయింపు జూలై 10న జరగనుండగా, జూలై 14న స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
మిగిలిన 4 IPO విషయానికి వస్తే.. చిన్న, మధ్య తరహా పరిశ్రమల (SMEలు) రంగానికి చెందిన కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. స్మార్టెన్ పవర్ సిస్టమ్స్, కెమ్‌కార్ట్ ఇండియా, గ్లెన్ ఇండస్ట్రీస్ ఆస్టన్ ఫార్మాస్యూటికల్స్ వంటి కంపెనీలు ఐపీఓ ద్వారా భారీగా నిధులు సమీకరించుకునేందుకు రెడీ అవుతున్నాయి.

ఇక లిస్టింగ్ పరంగా చూసుకుంటే క్రిజాక్ మెయిన్‌బోర్డ్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే 8 SME కంపెనీలు కూడా వచ్చే వారం స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ వారం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులకు ఎన్నో అవకాశాలు ఎదురవుతున్నాయి. అయితే మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వారంలో SME IPOలు
1.కెమ్‌కార్ట్ ఇండియా ఐపీఓ : జూలై 7 నుండి 9 వరకు ఓపెన్. రూ. 80.08 కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేరు ధర రూ. 236 - రూ. 248. కనీసం 1,200 షేర్లు కొనాలి. జూలై 14న BSE SMEలో లిస్ట్ అవుతుంది.
2.స్మార్టెన్ పవర్ సిస్టమ్స్ ఐపీఓ: జూలై 7 నుండి 9 వరకు ఓపెన్. రూ. 50 కోట్ల సమీకరణ లక్ష్యంగా ఉంది. ఒక్కో షేరు ధర రూ. 100. కనీసం 1,200 షేర్లను పెట్టుబడిదారులు కొనుగోలు చేయాలి. జూలై 14న NSE SMEలో లిస్ట్ అవుతుంది.
3.గ్లెన్ ఇండస్ట్రీస్ ఐపీఓ: జూలై 8 నుండి 10 వరకు ఓపెన్. రూ. 63.02 కోట్ల సమీకరణతో 6.49 మిలియన్ షేర్లు ఇస్తోంది. ఒక్కో షేరు ధర రూ. 92-97 మధ్య ఉంటుంది. కనీసం 1,200 షేర్లు కొనాలి. జూలై 15న BSE SMEలో లిస్ట్ అవుతుంది.
4. అస్టన్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ : జూలై 9 నుండి 11 వరకు ఓపెన్. రూ. 27.56 కోట్ల సమీకరణ లక్ష్యం. ఒక్కో షేరు ధర రూ. 113-123. కనీసం 2,000 షేర్లను పెట్టుబడిదారులు కొనుగోలు చేయాలి. జూలై 16న BSE SMEలో లిస్ట్ అవుతుంది.
ఐపీఓల లిస్టింగ్స్:
క్రిజాక్ ఐపీఓ : విద్యా రంగానికి చెందిన B2B ప్లాట్‌ఫారమ్ అయిన క్రిజాక్, జూలై 9న మార్కెట్‌లో ప్రవేశించనుంది. మొత్తం రూ. 860 కోట్ల ఐపీఓ నిర్వహించింది. ఈ ఐపీఓ 62.89 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యింది. గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) కూడా పెరిగింది.
SME లిస్టింగ్స్: జూలై 7న ఐదు SME కంపెనీలు - సిల్కీ ఓవర్సీస్, పుష్పా జువెలర్స్, సీడార్ టెక్స్‌టైల్స్, మార్క్ లోయర్ ఫ్యాషన్స్, వందన్ ఫుడ్స్ లిస్ట్ అవుతాయి. జూలై 10న క్రయోజెనిక్ OGS (BSE SME), హ్యాపీ స్క్వేర్ అవుట్‌సోర్సింగ్ (NSE SME) లిస్ట్ అవుతాయి.


Click it and Unblock the Notifications