ఈ షేర్లు కొని రాత్రికి రాత్రే అందరూ కోటీశ్వరులవుతున్నారు..స్టాక్ మార్కెట్లో పెను ఆర్థిక విప్లవం రేపుతున్న AI
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసిస్తోంది. ఇది కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాకుండా ప్రపంచంలో కొత్త బిలియనీర్లను సృష్టించే శక్తివంతమైన యంత్రంగా మారింది. 2025 నాటికి AI విప్లవం వల్ల ప్రపంచ ఆర్థిక రంగంలో పెను తుఫాను రేగింది. ప్రత్యేకించి జనరేటివ్ AI, హార్డ్‌వేర్, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో భారీ పెట్టుబడులు ప్రవేశించడం ప్రారంభమైంది. ఫలితంగా కంపెనీలు API సబ్‌స్క్రిప్షన్‌లు, డేటా సేవలు, ఎంటర్‌ప్రైజ్ ఒప్పందాలు ద్వారా బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సాధించాయి.
ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ తన కంపెనీకి AI హార్డ్‌వేర్ రంగంలో ఆధిపత్యాన్ని తీసుకువచ్చి.. ఒక్కసారిగా టాప్ 10 బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు. వారి GPUలు డేటా సెంటర్ డిమాండ్ ద్వారా కోట్ల ఆదాయాన్ని తీసుకురావడం ద్వారా ఎన్విడియా సంపద ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. OpenAI సంస్థ కూడా, GPT, ChatGPT వంటి సాధనాల ద్వారా API వినియోగం పెంచి, మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం ద్వారా విలువను 500 బిలియన్ల డాలర్లకు చేరువ చేసింది.

అంతే కాకుండా స్కేల్ AI డేటా లేబులింగ్.. అనోటేషన్ సేవలలో మార్కెట్ లీడర్లుగా మారిన మెటా, పేపర్ గేమ్స్, ఫిగర్ Artificial Intelligence వంటి సంస్థలతో బిలియన్ల డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంతో పాటు మరో సంస్థ సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్ సంస్థ భద్రతా ప్రోటోకాల్‌లు, భవిష్యత్తు లైసెన్సింగ్ నమూనాల ద్వారా భారీ ఆదాయాన్ని సృష్టిస్తోంది. ఈ AI విప్లవం సిలికాన్ వ్యాలీని మరోసారి ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల ఆసక్తిని ఆకర్షించింది.
గత ఏడాదిలో సుమారు 35 బిలియన్ల డాలర్ల వెంచర్ నిధులు AI రంగానికి మౌలిక పెట్టుబడులుగా వచ్చాయి. CB ఇన్‌సైట్స్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 498 AI యునికార్న్ సంస్థలు ఉన్నాయి, వీటి మొత్తం విలువ 2.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు AI డబ్బు సంపాదించే యంత్రంగా మారి చరిత్రలో అతిపెద్ద సంపద సృష్టి రేసులో భాగంగా నిలిచింది. అనేక మంది మాజీ OpenAI ఉద్యోగులు, స్కేల్ AI సహ వ్యవస్థాపకులు అలెగ్జాండర్ వాంగ్, లూసీ గువో వంటి నిపుణులు తమ స్టార్టప్‌ల ద్వారా బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించారు. ఉదాహరణకి మైఖేల్.. ఇంట్రాటర్ కోర్‌వీవ్ సంస్థ ద్వారా 6 బిలియన్ డాలర్ల విలువను ఆర్జించగా.. అలెగ్జాండర్ వాంగ్ మెటా ద్వారా 3.6 బిలియన్ డాలర్ల విలువను సృష్టించారు.
ఈ డిజిటల్ సువర్ణయుగంలో AI ఆధారిత పెట్టుబడులు, API సేవలు, క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ సేవలు తదితర రంగాల్లో పెట్టుబడిదారులు దూసుకెళ్తున్నారు. ఇది రోజురోజుకూ నూతన బిలియనీర్లను సృష్టిస్తూ ఆర్థిక ప్రపంచాన్ని మారుస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే AI ఇప్పుడు డబ్బు సంపాదించే యంత్రంగా మారిపోయింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications


