Sterlite Tech: కొన్ని కంపెనీల షేర్లను విదేశీ మదుపరులు విక్రయిస్తే పతనాన్ని చూస్తుంటాయి. కానీ జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఇక్కడ ఒక కంపెనీ షేర్లు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా కొనసాగుతున్నాయి. పైగా ప్రస్తుతం కంపెనీ షేర్ల ధర కూడా రూ.100 కంటే తక్కువ స్థాయిలోనే ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్టెర్లైట్ టెక్ కంపెనీ షేర్ల గురించే. నేడు ఇంట్రాడేలో ఈ కంపెనీ షేర్లు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాయి. వాస్తవానికి కంపెనీ షేర్లు నేడు ట్రెండ్ కావటానికి కీలక కారణాన్ని పరిశీలిస్తే.. అమెరికాకు చెందిన గోల్డ్‌మన్ సాచ్స్ అసెట్ మేనేజ్‌మెంట్ స్టెర్లైట్ టెక్నాలజీస్‌లో హోల్డ్ చేస్తున్న 2 శాతానికి పైగా వాటాను ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా రూ.84 కోట్లకు విక్రయించింది. కంపెనీ తన అనుబంధ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ ఫండ్స్ - గోల్డ్‌మన్ సాచ్స్ ఇండియా ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ద్వారా స్టెర్లైట్ టెక్నాలజీస్‌కి చెందిన కోటికి పైగా షేర్లను విక్రయించింది.

మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కంపెనీ షేర్ల విక్రయానికి సంబంధించిన వార్త రావటంతో నేడు ఇంట్రాడేలో స్టాక్ తన గరిష్ఠ ధర రూ.82.42కి చేరుకోవటం గమనార్హం. గోల్డ్‌మన్ సాచ్స్ ట్రేడ్ ద్వారా ఒక్కో షేరును సగటున రూ.81.04 వద్ద విక్రయించినట్లు మార్కెట్ డేటా ప్రకారం వెల్లడైంది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన బంధన్ మ్యూచువల్ ఫండ్ స్టెర్లైట్ టెక్నాలజీస్‌లో 6.011 మిలియన్ షేర్లను లేదా 1.23 శాతం వాటాను రూ.48.69 కోట్లకు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.
వాస్తవానికి నిన్నటి నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లు మంచి రికవరీని నమోదు చేస్తున్నాయి. గడచిన కొన్ని వారాలుగా నిరంతరం పతనంతో మార్కెట్లు భారీ కరెక్షన్ చూసిన సంగతి తెలిసిందే. దీంతో పోర్ట్ ఫోలియోలు ఎరుపెక్కిన చాలా మంది ఇన్వెస్టర్లు ప్రస్తుతం తిరిగి లాభాల బాట పడుతున్నారు. ఈ క్రమంలో స్టెర్లైట్ టెక్ గడచిన ఆరు నెలల కాలంలో 40 శాతం, ఏడాదిలో 30 శాతం క్షీణతను చూసింది. అలాగే గడచిన నెల రోజుల కాలాన్ని పరిశీలిస్తే స్టాక్ దాదాపు 23 శాతం నష్టాలను ఇన్వెస్టర్లకు మిగిల్చింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ఠ ధరను గమనిస్తే ఒక్కో షేరుకు రూ.78.90గా ఉండగా.. 52 వారాల గరిష్ఠ షేర్ ధర రూ.155.25గా ఉంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications