Steelman Telecom Stock: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ కొన్ని కంపెనీల షేర్లు మాత్రం అవేవీ పట్టించుకోకుండా రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. అయితే ఏకంగా 20 శాతం పెరిగి స్టాక్ మార్కెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కంపెనీ షేర్లు టాక్ ఆఫ్ ది టౌన్ కావటానికి కారణం ముఖేష్ అంబానీ కంపెనీ అని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. స్టీల్‌మ్యాన్ టెలికాం కంపెనీ షేర్లు ఇంట్రాడేలో ఏకంగా 20శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. ఇన్వెస్టర్ల నుంచి షేర్ల కొనుగోలు కోసం భారీగా స్పందన రావటంతో ఒక్కో షేరు ధర ఈ క్రమంలో రూ.154.80 రేటు వద్దకు ఇంట్రాడేలో చేరుకున్నాయి. అయితే కంపెనీ షేర్లలో హఠాత్తుగా భారీ పెరుగుదల రావటం, ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలు కోసం ఆతృతపడటానికి పెద్ద కారణం ఒకటి ఉంది. కంపెనీ రిలయన్స్ జియో సంస్థ నుంచి ఏకంగా రూ.147 కోట్ల విలువైన వర్క్ ఆర్డర్ పొందినట్లు వెల్లడికావటంతో స్టాక్ ధర రాకెట్ వేగంతో పరుగులు పెట్టడం ప్రారంభించింది.

కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ ప్రకారం.. ఇండోర్ స్మాల్ సెల్స్, ఇండోర్ అండ్ అవుట్ డోర్ వైఫై, ఎంటర్‌ప్రైజ్ యూబీఆర్ నిర్వహణ కోసం ఫ్రంటెండ్, బ్యాక్ ఎండ్ మరియూ సూపర్‌వైజరీ టీమ్‌ను అందిస్తుంది. ఈ డీల్ దాదాపు 3 ఏళ్ల పాటు ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.123.84 కోట్ల కంటే అంబానీ సంస్థ నుంచి పొందిన ఆర్డర్ విలువ చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. టెలికాం పరిశ్రమలో కంపెనీకి సర్వీస్ ప్రొవైడర్‌గా గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. కమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్వహించడం, విస్తరించడంపై కంపెనీ దృష్టి సారిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రెండవ అతిపెద్ద టెలికాం మార్కెట్ గా ఉన్న భారత్ గడచిన దశాబ్ధకాలంగా రిలయన్స్ జియో ఎంట్రీతో టెక్నాలజీ పరంగా కూడా భారీ మార్పులను చూస్తోంది.
Steelman Telecom కంపెనీ షేర్లు 52 వారాల కనిష్ఠ ధర రూ.114.05 వద్ద ఉండగా, 52 వారాల గరిష్ఠ ధర రూ.204.80 వద్ద కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2023-24 బడ్జెట్లో కేంద్రం టెలికాం రంగానికి దాదాపు రూ.92,000 కోట్లను కేటాయించింది. ఇందులో 60 శాతానికిపైగా క్యాపిటల్ ఎక్స్‍పెన్సెస్ కోసం వెచ్చించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ తన నైపుణ్యాలను వేగంగా పెరుగుతున్న టెలికాం మార్కెట్ డిమాండ్లను తీర్చటానికి వినియోగిస్తోంది. ఈ ఏడాదిని పరిశీలిస్తే టెలికాం యూజర్లను ఎక్కువగా ఆకర్షిస్తూ ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే వైర్ లెస్ వినియోగదారుల కేటగిరీలో 46.37 కోట్ల సబ్ స్క్రైబర్లతో ఇప్పటికీ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications