SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల.. పెరిగిన లాభం..!
అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఏడాది ప్రాతిపదిక నికర లాభంలో 14.3 శాతం వృద్ధిని సాధించింది. బ్యాంకు నికర లాభం రూ. 23,038 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయంలో బలమైన వృద్ధి సాధించింది. ఈ త్రైమాసికంలో కేటాయింపులు తగ్గడం బ్యాంకు ఆదాయానికి ఊతమిచ్చాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (NII) - అంటే పొందిన వడ్డీకి, చెల్లించిన వడ్డీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగి రూ. 49,143 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 42,847 కోట్లుగా ఉంది.
ఆదాయంలో బలమైన వృద్ధి ఉన్నప్పటికీ ఎస్‌బీఐ నిర్వహణ లాభం 1.4 శాతం తగ్గి, గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 27,311 కోట్ల నుంచి రూ. 26,937 కోట్లకు పడిపోయింది. ఈ త్రైమాసికంలో బ్యాంకుకు రూ. 7,288 కోట్ల మేర ఒకేసారి వచ్చే ఆదాయం లభించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కేటాయింపులు గణనీయంగా తగ్గి రూ. 4,217 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో ఇవి రూ. 5,400 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు జూన్ త్రైమాసికంతో పోలిస్తే కూడా ఈ కేటాయింపులు తక్కువగానే ఉన్నాయి.

ఈ త్రైమాసికంలో ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిల నిష్పత్తి, అంతకుముందు త్రైమాసికంలోని 1.47 శాతం నుండి 1.39 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే కాలానికి ఎస్‌బీఐ మొండి బకాయిల కోసం రూ.4,132 కోట్లు ప్రొవిజన్లు కింద కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.2,759 కోట్లకు తగ్గింది. అలాగే నికర మొండి బకాయిల నిష్పత్తి కూడా గత త్రైమాసికంలోని 0.38 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో ఎస్‌బీఐ (SBI) స్లిప్పేజ్ నిష్పత్తిని 0.50 శాతంగా నమోదు చేయగా, దేశీయ నికర వడ్డీ మార్జిన్ (NIM) 3.11 శాతంగా ఉంది. ఆదాయ ఫలితాల ప్రకటన తర్వాత, ఎస్‌బీఐ షేర్లు 0.73 శాతం తగ్గి రూ. 979.75 వద్ద ట్రేడయ్యాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications