దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి లేటెస్ట్ గా ఓ వార్త బయటకు వచ్చింది.SBI త్వరలో రూ. 25 వేల కోట్ల క్వాలిఫైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్‌మెంట్ (QIP) ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఈ అతి పెద్ద వ్యాపార ప్రతిపాదనకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ రోజు వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP) మార్గం ద్వారా ఎస్బీఐ రూ.25,000 కోట్ల వరకు సేకరించడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం. పూర్తిగా సబ్‌స్క్రైబ్ చేస్తే ఈ ఇష్యూ దేశంలోని సంస్థాగత పెట్టుబడిదారులకు అతిపెద్ద వాటా అమ్మకం అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ కథనంపై State Bank of India నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
బయటకు వచ్చిన నివేదిక ప్రకారం SBI యొక్క QIP ధర ఒక్కో షేరుకు రూ. 790 నుండి రూ. 800 మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత మార్కెట్ ధర నుండి 2-3% తగ్గింపుగా ఉంది. ఈ QIP స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా మారవచ్చు.
కాగా దీనిపై 2025 మే నెలలో సెబీ ద్వారా ఆమోదం కూడా పొందింది. QIP/ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) లేదా ఏదైనా ఇతర అనుమతించబడిన మోడ్ ద్వారా FY2026లో రూ. 25 వేల కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని పొందేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..సెబీ బోర్డు నుంచి పర్మిషన్ పొందింది.

తాజా నివేదికల ప్రకారం LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఈ QIPలో దాదాపు రూ. 7 వేల కోట్ల యాంకర్ బిడ్‌కు ముందుకు రావచ్చని సమాచారం. దీనితో పాటు దేశీయ మ్యూచువల్ ఫండ్ల నుండి ఈ QIPకి మంచి డిమాండ్ కూడా ఉంది. యాంకర్ బిడ్ అనేది యాంకర్ బిడ్-కమ్-ఛాలెంజ్ అనే ప్రక్రియలో ఒక భాగం. ఇది సాధారణంగా వేలం ప్రక్రియలలో ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో, ఒక ఇన్వెస్టర్ యాంకర్ బిడ్డర్‌గా ఎంపిక అవుతాడు. తరువాత ఇతర బిడ్డర్లు ఆ బిడ్ కంటే ఎక్కువ బిడ్ వేయడానికి అవకాశం ఉంటుంది. చివరికి ఎక్కువ బిడ్ చేసిన వ్యక్తి ఆ వస్తువు లేదా సేవను పొందుతాడు.
ఉదాహరణకు ఒక బ్యాంకు తన మొండి బకాయిలను విక్రయించడానికి యాంకర్ బిడ్-కమ్-ఛాలెంజ్ ప్రక్రియను ఉపయోగించవచ్చు. ఒక సంస్థ ఆ బకాయిలను కొనుగోలు చేయడానికి యాంకర్ బిడ్ వేయవచ్చు. ఇతర సంస్థలు ఆ బిడ్ కంటే ఎక్కువ బిడ్ వేయవచ్చు. యాంకర్ ఇన్వెస్టర్లు అంటే ఓ రకమైన పెట్టుబడిదారులు. వీరికి IPOలలో వాటాలను పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా పెద్ద సంస్థలు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటివి యాంకర్ ఇన్వెస్టర్లుగా ఉంటాయి
ఈరోజు జూలై 16, 2025 బుధవారం SBI షేర్లలో స్వల్ప పెరుగుదల కనిపించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) షేర్లు ప్రారంభ ట్రేడింగ్ సమయంలో రూ. 820.60 వద్ద 0.51% పెరిగి రూ. 816.45 వద్ద ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో SBI షేర్లు రూ. 824 గరిష్ట స్థాయిని, 815.30 కనిష్ట స్థాయిని తాకాయి. ప్రస్తుతం క్ మార్కెట్ క్యాప్ రూ.7.33 లక్షల కోట్లుగా ఉండగా, పి/ఇ నిష్పత్తి 9.45గా ఉంది. డివిడెండ్ దిగుబడి 1.94%గా ఉంది. ఎస్‌బిఐ 52 వారాల గరిష్ట స్థాయి రూ.899 కాగా కనిష్ట స్థాయి రూ.680గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications