SBI: ఎస్బీఐపై కాసుల వర్షం కురిపించనున్న ఎన్ఎస్ఈ ఐపీఓ..!
భారతదేశపు అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(NSE) ఐపీఓ వచ్చే వారం మార్కెట్లోకి రానుంది. ఇందులో వాటాలు విక్రయిస్తున్న చాలా మంది వాటాదారులు భారీ లాభాలను (మల్టీబ్యాగర్ గెయిన్స్) ఆర్జించనున్నారు. దశాబ్దాల క్రితం చేసిన పెట్టుబడుల ద్వారా వారికి ఈ భారీ లాభాలు దక్కనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ ఐపీఓ ద్వారా రూ.2,849 కోట్ల లాభాన్ని లేదా 2,23,025 శాతం రాబడిని పొందే అవకాశం ఉంది. 'రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్' (RHP)లోని వివరాల ప్రకారం ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ గతంలో ఒక్కో షేరును కేవలం రూ.0.8 ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ధరల శ్రేణిలో గరిష్ట స్థాయిని ఒక్కో షేరుకు రూ.1,785గా నిర్ణయించడంతో ఎస్బీఐ తన పెట్టుబడిపై భారీ లాభాన్ని ఆర్జించనుంది.
ఇందులో ప్రమోటర్‌గా ఉన్న ఎస్బీఐ కూడా కొంత వాటాను విక్రయిస్తోంది. ఎన్ఎస్ఈలో తనకున్న మొత్తం వాటా (3.23 శాతం వాటాకు సమానమైన 7.98 కోట్ల షేర్లు) నుంచి ఎస్బీఐ 1,59,69,410 (1.60 కోట్లు) షేర్లను విక్రయిస్తోంది. దీంతో కళ్లుచెదిరే రీతిలో ఎస్బీఐ ఇక్కడ ఎన్ఎస్ఈ ఐపీఓ ద్వారా లాభాలు అందుకోబోతుంది. ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ' 5,57,712 శాతం రాబడిని పొందే అవకాశం ఉంది. తద్వారా శాతం పరంగా చూస్తే ఎన్ఎస్ఈ ఐపీఓ ద్వారా అత్యధిక ప్రయోజనం పొందే సంస్థగా ఇది నిలవనుంది. ఇది ఒక్కో షేరును రూ.0.32 ధరకు కొనుగోలు చేసింది. ఐపీఓలో షేర్లు విక్రయించడం ద్వారా రూ.1,874 కోట్ల లాభం పొందింది.

అదే సమయంలో SBI క్యాపిటల్ మార్కెట్' 4,69,637 శాతం రాబడిని లేదా రూ.1,567 కోట్ల లాభాన్ని పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక్కో షేరును కేవలం రూ.0.38 ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఒక్కో షేరును రూ.1,785 విక్రయిస్తోంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ లాభం 3,87,943 శాతంగా (₹1,104 కోట్లు) ఉండనుంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ తన పెట్టుబడిపై 3,56,900 శాతం రాబడిని లేదా రూ.1,071 కోట్ల లాభాన్ని పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంలో ఈ గణాంకాలు 3,30,456 శాతం లేదా రూ.1,372 కోట్లుగా ఉన్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 33,835 శాతం లేదా రూ.1,101 కోట్ల లాభాన్ని పొందనుంది.
కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్, 'MS స్ట్రాటజిక్, అరాండా ఇన్వెస్ట్‌మెంట్స్ కలిసి మొత్తం రూ.5,562 కోట్లను ఆర్జించనున్నాయి.మొత్తంగా చూస్తే ఈ 10 మంది వాటాదారులు తాము పెట్టిన రూ.534 కోట్ల పెట్టుబడిపై రూ.16,500 కోట్ల లాభాన్ని పొందనున్నారు. ఎన్ఎస్ఈ ఐపీఓ బిడ్డింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 17న ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుంది. ఎన్ఎస్ఈ తన IPO పరిమాణాన్ని 15 శాతానికి పైగా తగ్గించినప్పటికీ, ఇది దేశంలోనే మూడవ అతిపెద్ద IPOగా నిలవనుంది. ఆఫర్ ధరల శ్రేణిలో గరిష్ట స్థాయి వద్ద కంపెనీ రూ.22,567 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎక్స్ఛేంజ్ నికర ఆఫర్‌లో 50 శాతాన్ని QIBల (సంస్థాగత పెట్టుబడిదారులు) కోసం, 35 శాతాన్ని రిటైల్ పెట్టుబడిదారుల కోసం, మిగిలిన 15 శాతాన్ని NIIల (నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) కోసం కేటాయించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
