Standard Glass Lining IPO: కొత్త వారంలో ఐపీవోలు బ్రేకుల్లోని బుల్డోజర్లు మాదిరిగా పరిగెడుతున్నాయి. ప్రధానంగా ఈవారం ఇన్వెస్టర్ల సబ్ స్క్రిప్షన్ కోసం వస్తున్న ఐపీవోలు రికార్డు లాభాలను అందించటానికి సిద్ధంగా ఉన్నాయని గ్రేమార్కెట్ ప్రీమియం చూస్తుంటే తెలుస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీ ఐపీవో రికార్డుల మోత మోగిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి కంపెనీ ఐపీవో నేడు సాధారణ పెట్టుబడిదారుల కోసం తెరుచుకుంది. అయితే కేవలం కొన్ని గంటల్లోనే షేర్ల కొనుగోలుకు భారీగా దరఖాస్తులు రావటంతో తొలిరోజే పెట్టుబడిదారుల నుంచి భారీగా డిమాండ్ కనిపించింది. మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు బెట్టింగ్‌ల సంఖ్య కంటే 5 రెట్లు ఎక్కువ పొందింది. ఇదే క్రమంలో గ్రేమార్కెట్లో కంపెనీ షేర్ల పనితీరును పరిశీలిస్తే ఒక్కో షేరుపై రూ.140 ప్రీమియం ధర పలుకుతోంది.

తొలిరోజే ఐపీవోపై ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వాస్తవానికి ఐపీవో జనవరి 6న సాధారణ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది. అలాగే ఇష్యూ జనవరి 8 వరకు బెట్టింగ్ వేసే ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉండనుంది. తాజాగా కంపెనీ తన ఐపీవో కోసం షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.133 నుంచి రూ.140గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ తన ఐపీవో లాట్ పరిమాణాన్ని 107 షేర్లుగా నిర్ణయించింది. ఐపీవోలో పాల్గొనాలనుకుంటున్న ఇన్వెస్టర్లు ఒక లాట్ కొనుగోలు కోసం కనీసం రూ.14,980 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.
కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి తన మూలధన అవసరాల కోసం రూ.410.05 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. అయితే ఇందులో రూ.210 కోట్లను తాజా ఈక్విటీ ద్వారా రైజ్ చేయాలని నిర్ణయించగా.. మిగిలిన మెుత్తాన్ని ఆఫర్ ఫర్ సేల్ రూపంలో షేర్లను విక్రయించటం ద్వారా రైజ్ చేయాలని చూస్తోంది. షేర్ల అలాట్మెంట్ జనవరి 9న ఫైనల్ కానుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ ఐపీవో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో జనవరి 13, 2025 జాబితా కానుందని ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 72.49 శాతం వాటాలు ఉన్నాయి.
కంపెనీ వ్యాపారం..
కంపెనీ తన వ్యాపారాన్ని సెప్టెంబర్ 2012లో స్థాపించింది. స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ కంపెనీ దేశంలోని ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలకు ఇంజనీరింగ్ పరికరాల తయారీదారుగా వ్యవహరిస్తోంది. కంపెనీ డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, అసెంబ్లీ, ఇన్‌స్టాలేషన్ సామర్థ్యాలను కలిగి ఉంది. అలాగే కంపెనీ వ్యాపారానికి అవసరమైన అన్ని స్థాయిల ప్రక్రియలను సొంతంగా చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఐపీవో ద్వారా సమీకరిస్తున్న మెుత్తంలో కొంత భాగాన్ని కొత్త యంత్రాల కొనుగోలుకు వినియోగించాలని నిర్ణయించింది. అలాగే ఇందులో రూ.130 కోట్లను రుణాల చెల్లింపులకు ఉపయోగించనుంది. ఇదే క్రమంలో పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ S2 ఇంజనీరింగ్‌లో పెట్టుబడి పెట్టడానికి రూ.30 కోట్లను ఉపయోగించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications