ఈ సోలార్ షేర్లను కొనేందుకు ఎగబడుతున్న జనం.. జూన్ 1 తర్వాత అసలు ఆట మొదలు!
ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ (stock market) లో సోలార్ ఎనర్జీ రంగానికి చెందిన కంపెనీల షేర్లు బుల్లెట్‌లా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా జూన్ 1, 2026 నాటికి కేంద్ర ప్రభుత్వం విధించిన ఒక కీలకమైన డెడ్‌లైన్ కారణంగా.. 'వారీ ఎనర్జీస్' (Waaree Energies), 'ప్రీమియర్ ఎనర్జీస్' (Premier Energies) వంటి కంపెనీల షేర్లలో విపరీతమైన జోరు కనిపిస్తోంది. ఇంతకీ ఈ జూన్ 1 డెడ్‌లైన్ ఏంటి? దీనివల్ల సోలార్ కంపెనీల షేర్లు ఎందుకు అంతగా పెరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) గతంలో 'ALMM' (అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మాన్యుఫాక్చరర్స్) అనే ఒక పాలసీని తీసుకొచ్చింది. మన దేశంలో సోలార్ వస్తువుల తయారీని పెంచడం, చైనా వంటి విదేశాల నుంచి దిగుమతులను తగ్గించడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం.

చైనాకు చెక్.. దేశీయ కంపెనీలకు లక్!
ఈ పాలసీలో భాగంగానే జూన్ 1, 2026 నుండి కొత్త రూల్స్ (ALMM లిస్ట్-II) అమల్లోకి రాబోతున్నాయి. దీని ప్రకారం.. ప్రభుత్వ పథకాలు, ఓపెన్ యాక్సెస్ , నెట్-మీటరింగ్ సిస్టమ్‌లతో ముడిపడి ఉన్న సోలార్ ప్రాజెక్టులలో కేవలం భారత ప్రభుత్వం ఆమోదించిన దేశీయ కంపెనీల నుండి తయారు చేసిన సోలార్ సెల్స్‌ను మాత్రమే వాడాలి. అంటే, కంపెనీలు ఇకపై విదేశాల నుండి ఇష్టమొచ్చినట్టు సోలార్ వస్తువులను దిగుమతి చేసుకోలేవు.
ఇప్పటివరకు మన దేశంలో సోలార్ ప్యానెల్ మోడ్యూల్స్ తయారీ బాగానే ఉన్నా.. వాటికి కావలసిన 'సోలార్ సెల్స్' కోసం ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడేవాళ్లం. కానీ ఈ కొత్త రూల్ వల్ల కంపెనీలన్నీ సొంతంగా మన దేశంలోనే వీటిని తయారు చేయాల్సి ఉంటుంది.
ఇన్వెస్టర్లకు లాభాల పంట!
స్టాక్ మార్కెట్ (stock market) లో సోలార్ షేర్లు ఇంతలా పెరగడానికి అసలు కారణం ఇదే. వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ వంటి కంపెనీలు ఇప్పటికే దేశీయంగా సోలార్ సెల్స్ తయారీ సామర్థ్యాన్ని భారీగా పెంచుకున్నాయి. ప్రభుత్వ ఆమోదిత లిస్టులో కూడా చేరిపోయాయి. అందుకే రాబోయే రోజుల్లో వీటికి ఆర్డర్లు భారీగా పెరుగుతాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
దీనికి తోడు, జూన్ 1 డెడ్‌లైన్‌ను పొడిగించే ప్రసక్తే లేదని ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది. దీనివల్ల విదేశీ కంపెనీల పోటీ తగ్గి, మన లోకల్ కంపెనీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడనుంది. ఓవరాల్‌గా, ఈ సరికొత్త నిర్ణయం భారతదేశాన్ని సోలార్ రంగంలో స్వయంసమృద్ధిగా మార్చడమే కాకుండా.. స్టాక్ మార్కెట్ (stock market) లోని సోలార్ ఇన్వెస్టర్లకు కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతోంది.
భవిష్యత్తు అంతా సోలార్‌దే!
రాబోయే రోజుల్లో క్లీన్ ఎనర్జీకి డిమాండ్ మరింత పెరగనుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి కఠినమైన నిర్ణయాల వల్ల మన దేశీయ కంపెనీల మార్కెట్ వాల్యూ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే లాంగ్ టర్మ్‌లో మంచి లాభాలు సంపాదించాలనుకునే వారికి లాంగ్ రన్‌లో ఈ రంగానికి చెందిన షేర్లు ఒక మంచి ఆప్షన్‌గా మారుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications