Leo Dry Fruits IPO: దేశీయ స్టాక్ మార్కెట్లో కొత్తగా పెట్టుబడిదారులు రావటంతో స్టాక్ మార్కెట్లో రద్దీ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఐపీవోలపై బెట్టింగ్ వేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనికి తోడు ఎస్ఎమ్ఈ, మెయిన్ బోర్డు ఐపీవోలు నిరంతరం పెరుగుతుండటంతో లిస్టింగ్ లాభాలను వొడిసిపట్టేందుకు ట్రేడర్లు యాక్టివ్ గా ఉన్నారు.
ఈ క్రమంలో నేడు మనం మాట్లాడుకోబోతున్నది స్టాక్ మార్కెట్లో జాబితా అయిన లియో డ్రైఫ్రూట్స్ అండ్ స్పైసెస్ కంపెనీ ఐపీవో గురించే. బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో 30.77 శాతం ప్రీమియం ధర వద్ద లిస్ట్ కావటంతో పెట్టుబడిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒక్కో షేరు రూ.68 రేటు వద్ద మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీని నమోదు చేశాయి. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.116.29 కోట్లుగా కొనసాగుతోంది. వాస్తవానికి కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.25.12 కోట్లను సమీకరించింది. ఇందుకోసం 48.30 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది.

లియో డ్రైఫ్రూట్స్ అండ్ స్పైసెస్ కంపెనీ తన ఐపీవోను సాధారణ ఇన్వెస్టర్ల కోసం జనవరి 1 నుంచి జనవరి 3 వరకు సబ్ స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంచింది. కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.51-52గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా నిర్ణయించటంతో పెట్టుబడిదారులు కనీసం రూ.1,04,000 పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఐపీవో ప్రక్రియలో భాగంగా కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.6.88 కోట్లను సమీకరించింది. ఐపీవోకి ముందు కంపెనీలో ప్రమోటర్ల వాటా 52.21 శాతంగా ఉండగా ప్రస్తుతం 38.11 శాతానికి తగ్గింది.
మహారాష్ట్ర కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న కంపెనీ తాజా ఐపీవో ద్వారా సమీకరిస్తున్న మెుత్తాన్ని ప్రధానంగా వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతో పాటు బ్రాండింగ్, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ అవసరాలతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది. కంపెనీ తన వ్యాపారాన్ని నవంబర్ 2019లో స్థాపించబడింది. ప్రస్తుతం కంపెనీ తన ఉత్పత్తులను VANDU, FRYD బ్రాండ్ పేర్ల కింద విక్రయిస్తోంది. కంపెనీ వివిధ ప్యాకేజింగ్ పరిమాణాల్లో మొత్తం, బ్లెండెడ్ సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, మసాలాలు, ఇతర కిరాణా వస్తువులను సరఫరా చేస్తుంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications