Super Stock: ఒక్కో షేరుకు 5 షేర్లు ఫ్రీగా ఇస్తున్న కంపెనీ.. ఏడాదిలో డబ్బు మూడింతలు చేసిందిగా..!!

Bonus Shares: కొన్ని నెలల కింద వరకు దేశీయంగా స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు ఎక్కువగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్ లలో అధికంగా పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ కేటగిరీల్లోని కంపెనీల షేర్లు భారీగా పెరుగుదలను చూశాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ల పతనం సమయంలో చాలా మంది ఇన్వెస్టర్లు బ్లూచిప్ కంపెనీలు, లార్జ్ క్యాప్ స్టాక్‌ల వైపు చూస్తున్నారు.

అయితే ప్రస్తుతం చాలా మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న స్మాల్ క్యాప్ కంపెనీ శక్తి పంప్స్ లిమిటెడ్. తాజాగా కంపెనీ బోర్డు పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఒక్కో షేరు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు 5 షేర్ల చొప్పున ఉచితంగా బోనస్ షేర్లను అందుకుంటారని కంపెనీ వెల్లడించింది. దీనికోసం రికార్డు తేదీగా నవంబర్ 25,2024ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. ఇదిలా ఉండగా కంపెనీ తన వాటాదారులకు గడచిన ఏడాది కాలంలో మంచి రాబడులను సైతం తెచ్చిపెట్టింది.

Smallcap stock Shakti Pumps giving 5 bonus shares to every share held by Investors Know details

కంపెనీ ఇటీవలి బోర్డు సమావేశం 5:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది. ఈ ఉచిత షేర్లను పొందటానికి అర్హత పొందాలంటే ఇన్వెస్టర్లు పైన పేర్కొన్న రికార్డు తేదీ నాటికి తమ డీమ్యాట్ ఖాతాల్లో షేర్లను హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే కంపెనీ బుక్స్ రికార్డుల్లో పెట్టుబడిదారునిగా చేరటానికి వీలు ఉంటుంది. వాస్తవానికి కంపెనీ పుస్తకాల్లో ఉన్న వారికి మాత్రమే బోనస్ షేర్లు అందించబడతాయి కాబట్టి గడువు సమయం నాటికి అర్హత పొందటం అన్నింటి కంటే ముఖ్యమేనదిగా గుర్తుంచుకోవాలి. ఇదే క్రమంలో ప్రముఖ రీసెర్చ్ అనలిస్ట్ ఏఆర్ రామచంద్రన్ శక్తి పంప్స్ స్టాక్‌పై కొనుగోలు ధర లక్ష్యాన్ని అందించారు.ఇందులో భాగంగా కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.4875గా ఉంచారు. ఇదే క్రమంలో పెట్టుబడిదారులు రూ.4475 స్టాప్ లాస్ ధరగా పరిగణించాలని సూచించారు.

నేడు ఇంట్రాడేలో ఉదయం క్షీమించినప్పటికీ తర్వాత కోలుకోవటంతో మధ్యాహ్నం 12 గంటలకు శక్తి పంప్స్ లిమిటెడ్ షేరు ధర 2.68 శాతం పెరిగి రూ.4495 వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇంట్రాడేలో స్టాక్ ధర అత్యల్పంగా రూ.4,346.45 రేటును తాకింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8,930 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ.5124.80గా ఉండగా.. 52 వారాల కనిష్టం రూ.928.95కి చేరుకుంది. గత నెలలో కంపెనీ షేర్లు దాదాపు 8 శాతం క్షీణతను చూడగా.. గడచిన ఆరు నెలలో కాలంలో 96 శాతం పెరుగుదలను చూసింది. అలాగే ఏడాది కాలంలో స్టాక్ తన పెట్టుబడిదారులకు 320 శాతం రాబడిని అందించింది. ఈ క్రమంలో షేర్ ధర రూ.3424 మేర పెరుగటంతో ఇన్వెస్టర్లు లాభాల పండుగ చేసుకుంటున్నారు. స్మాల్ క్యాప్ మల్టీబ్యాగర్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు నిరంతరాయంగా

కంపెనీ వ్యాపారం..
శక్తి పంప్స్ లిమిటెడ్ దేశంలోని వివిధ రంగాలకు చెందిన కంపెనీల అవసరాల కోసం సబ్‌మెర్సిబుల్ పంపులను తయారు చేస్తుంది. ఇది గృహ, పారిశ్రామిక, ఉద్యాన, వ్యవసాయ అవసరాల కోసం వివిధ ఉత్పత్తులను మార్కెట్లో వక్రయిస్తోంది. కంపెనీ తన ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. 1982లో స్థాపించబడిన కంపెనీ మధ్యప్రదేశ్‌లోని పితాంపూర్‌ కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+