Multibagger Stock: ఐదేళ్లలో 198 శాతం రాబడి ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!

మల్టీబ్యాగర్ స్టాక్ అయిన శ్రీరామ్ ఫైనాన్స్ గత ఏడాది కాలంలో 30 శాతం వరకు పెరిగింది. నిఫ్టీలో అత్యధిక లాభాలు పొందిన స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) తన సెప్టెంబర్ త్రైమాసిక (Q2FY27) ఫలితాలను అక్టోబర్ 23న ప్రకటించనుంది. ఈ ఫలితాలు బాగుండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా ప్రకారం కంపెనీ నికర వడ్డీ ఆదాయం (NII) గతేడాదితో పోలిస్తే (YoY) 35.1% పెరగవచ్చు, అదే సమయంలో నిర్వహణ లాభం 43.5% వృద్ధి చెందవచ్చు. నికర లాభం గతేడాదితో పోలిస్తే 56% మేర పెరగవచ్చు.

ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం ఈక్విటీ బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 12 శాతం పడిపోయినప్పటికీ, ఈ స్టాక్ గత ఏడాది కాలంలో 30% లాభపడింది. అయితే ఇటీవలి కాలంలో ఈ స్టాక్‌లో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్స్) కనిపించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి నిఫ్టీ 50లో 13 శాతం క్షీణతతో పోలిస్తే శ్రీరామ్ ఫైనాన్స్ షేరు ధర 11 శాతం తగ్గింది. ఈ స్టాక్ మూడు 141 శాతం, ఐదు సంవత్సరాల్లో 198 శాతం రాబడి ఇచ్చింది. శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు ఈ ఏడాది ఆగస్టు 6న రూ.1,153.70 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి చేరింది. అక్టోబర్ 21న రూ.690.30 వద్ద 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. Q1FY27 ఆదాయం గతేడాదితో పోలిస్తే 16% పెరిగి రూ.13,400 కోట్లకు చేరగా, పన్ను తర్వాత లాభం (PAT) 60 శాతం పెరిగి రూ.3,453 కోట్లకు చేరింది.

Multibagger Stock

యాజమాన్యం 18 శాతం వృద్ధి అంచనాలను ప్రకటించింది. ఈ స్టాక్ రూ.700 వద్ద ప్రాథమికంగా బలంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీని వాల్యుయేషన్ ప్రస్తుత 2.66x తో పోలిస్తే, గత 5 సంవత్సరాల మధ్యస్థ P/B అయిన 2x కు దగ్గరగా ఆకర్షణీయంగా ఉందని వివరిస్తున్నారు. సాంకేతిక పరంగా చూస్తే ఈ స్టాక్ ప్రస్తుతం తన 300-రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (DEMA) వద్ద కదులుతోంది. ఇది ఒక ముఖ్యమైన మద్దతు స్థాయిగా పనిచేస్తోందని వివరిస్తున్నారు. ఈ స్టాక్‌కు ప్రధాన మద్దతు రూ.890 వద్ద ఉందని ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్‌లో ఈక్విటీ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ అయిన జిగర్ ఎస్. పటేల్ పేర్కొన్నారు.

పెట్టుబడిదారులు స్టాక్ లో పెట్టుబడి పెట్టే ముందు అన్ని సరి చూసుకోవాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో రిస్క్ ఉంటుంది. స్టాక్ ఫండమెంటల్ చూసుకుని పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే నిపుణులను సంప్రదించాలని పేర్కొంటున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+