మార్కెట్ ఎలా ఉన్నా లాభాలు గ్యారెంటీ.. వచ్చే 2 వారాల్లో ఈ ఫార్మా, ఫైనాన్ష్ షేర్లపై ఓ లుక్కేయండి!

ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ (stock market) ఒక వింతైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలు, యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు (Crude oil) ధరల వల్ల మార్కెట్ ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగుస్తోంది. గత ట్రేడింగ్ సెషన్‌లో నిఫ్టీ 50 కేవలం 4 పాయింట్లు నష్టపోయి 23,654 వద్ద స్థిరపడగా, సెన్సెక్స్ 135 పాయింట్లు తగ్గి 75,183 వద్ద ముగిసింది.

ఇలాంటి కన్సాలిడేషన్ ఫేజ్‌లో ఇండెక్స్ కంటే కూడా స్టాక్-స్పెసిఫిక్ (ఏ షేరుకు ఆ షేరు) ట్రేడింగ్ అప్రోచ్ పాటించడం మంచిదని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా సూచిస్తున్నారు. నిఫ్టీకి ఎగువన 23,800-24,000 బలమైన రెసిస్టెన్స్ జోన్‌గా ఉందని, అది దాటితేనే సరికొత్త ర్యాలీ చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే 1 నుండి 2 వారాల కాలానికి (Short Term) ఇన్వెస్టర్లు కొనుగోలు చేయదగ్గ 3 బెస్ట్ స్టాక్స్‌ను ఆయన రికమండ్ చేశారు. ఆ వివరాలు ఇవే..

Short Term Stocks To Buy Glenmark Pharma Manappuram Finance Angel One Stock Market Picks

1. ఏంజెల్ వన్ (Angel One)

ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్‌కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఏంజెల్ వన్ షేరు మంచి బయ్యింగ్ మొమెంటంతో దూసుకుపోతోంది. గత కొన్ని రోజులుగా ఒకే రేంజ్‌లో ఉన్న ఈ స్టాక్, ఇప్పుడు భారీ వాల్యూమ్స్‌తో బ్రేక్ అవుట్ ఇచ్చింది. అంటే ఇది సరికొత్త అప్‌ట్రెండ్‌కు సంకేతం.

  • ప్రస్తుత ధర (ముగింపు): రూ. 339.65
  • టార్గెట్ ప్రైస్ (Target): రూ. 370
  • స్టాప్ లాస్ (Stop Loss): రూ. 325

2. గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ (Glenmark Pharma)

ఫార్మా రంగానికి చెందిన ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్‌లో ఉంది. అన్ని రకాల కీ మూవింగ్ యావరేజ్‌ల కంటే పైనే ఈ షేరు ట్రేడ్ అవుతోంది. మార్కెట్ పడుతున్న ప్రతిసారీ కింది స్థాయిల్లో ఇన్వెస్టర్లు ఈ షేరును కొనేస్తూ సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ కరెంట్ ప్రైస్ రేంజ్‌లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం మంచి ఆప్షన్.

  • ప్రస్తుత ధర (ముగింపు): రూ. 2,393
  • టార్గెట్ ప్రైస్ (Target): రూ. 2,590
  • స్టాప్ లాస్ (Stop Loss): రూ. 2,290

3. మణప్పురం ఫైనాన్స్ (Manappuram Finance)

బంగారు రుణాల (Gold Loans) రంగంలో ఉన్న మణప్పురం ఫైనాన్స్ చార్ట్ స్ట్రక్చర్ చాలా పాజిటివ్‌గా ఉంది. గత కొన్ని రోజులుగా ఉన్న డౌన్‌ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్‌ను బ్రేక్ చేసి ఈ స్టాక్ పైకి కదిలింది. బయ్యర్ల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ షేరు మరింత పైకి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

  • ప్రస్తుత ధర (ముగింపు): రూ. 322.40
  • టార్గెట్ ప్రైస్ (Target): రూ. 348
  • స్టాప్ లాస్ (Stop Loss): రూ. 310

(గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని అంశాలు సంబంధిత వ్యక్తుల లేదా విశ్లేషకుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇవి " Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited " అధికారిక సలహాలు కావు. ఇందులో సమాచారం యొక్క ఖచ్చితత్వానికి మేము ఎలాంటి గ్యారెంటీ ఇవ్వము. మేము స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాలు లేదా కొనుగోలు/అమ్మకాల సిఫార్సులు చేయము. ఈ కథనాలు కేవలం అవగాహన కోసం మాత్రమే ఉద్దేశించినవి. కాబట్టి, మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోగలరు. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+