Shiv Techem IPO: దేశీయ స్టాక్ మార్కెట్లోకి నేడు ఐపీవోల లిస్టింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వచ్చిన రెండు ఐపీవోలు తమ పెట్టుబడిదారులకు డీసెంట్ లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్ట్ అయిన ఐపీవో మాత్రం బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు సూపర్ లాభాలను అందించటంతో వారు పండుగ చేసుకుంటున్నారు. దీనిని చూస్తుంటే చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ మార్కెట్లో ఎస్ఎమ్ఈ ఐపీవోల హవా స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది నేడు మార్కెట్లో జాబితా అయిన ఎస్ఎమ్ఈ ఐపీవో శివ్ టెక్స్‌కెమ్ కంపెనీ గురించే. కంపెనీ షేర్లు ఐపీవో లిస్టింగ్ సమయంలో ఇష్యూ ధర కంటే 44 శాతం ప్రీమియంతో ఒక్కోటి రూ.239 రేటు వద్ద లిస్ట్ అయ్యాయి. దీని తర్వాత పెట్టుబడిదారుల నుంచి కొనసాగిన కొనుగోళ్ల కోలాహలంతో స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి ఇంట్రాడేలో ఒక్కో షేర్ రేటు రూ.250.95 స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తొలిరోజే తాము పొందిన షేర్లకు ఒక్కోదానిపై ఏకంగా రూ.85 లాభాన్ని అందుకున్నారు. నేడు శివ్ టెక్స్‌కెమ్ షేర్లు బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో విజయవంతంగా జాబితాను పూర్తి చేయటంతో ఇన్వెస్టర్లకు కాసుల పంట కురిసింది.

శివ్ టెక్స్‌కెమ్ కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.101.35 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఈ క్రమంలో కంపెనీ 61 లక్షలకు పైగా తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. పెట్టుబడిదారులు బెట్టింగ్ వేసేందుకు ఐపీవో అక్టోబర్ 8 నుంచి 10 వరకు తెరచి ఉంది. ఈ క్రమంలో కంపెనీ ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.158-166గా ఉంచింది. అలాగే లాట్ పరిమాణాన్ని 800 షేర్లుగా నిర్ణయించటంతో ఇన్వెస్టర్లు కనీసం రూ.1,32,800 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 68.27 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీ 455.58 సార్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోటా 86.70 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.
కంపెనీ వ్యాపారం..
శివ్ టెక్స్‌కెమ్ లిమిటెడ్ కంపెనీ 2005లో ప్రారంభించబడింది. కంపెనీ హైడ్రోకార్బన్ ఆధారిత రసాయనాలను దిగుమతి పంపిణీ వ్యాపారంలో ఉంది. రసాయనాలను అంతర్జాతీయ తయారీ, సరఫరాదారుల నుంచి సేకరిస్తుంటుంది. కంపెనీ పంపిణీ చేసే రసాయనాలు ఫీడ్‌స్టాక్‌లు, ప్రింటింగ్ ఇంక్స్, అగ్రోకెమికల్స్, స్పెషాలిటీ పాలిమర్స్, ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ స్పెషాలిటీ కెమికల్స్ రంగాల్లోని కంపెనీలు ముడి పదార్థంగా వినియోగిస్తుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను 39కి పెంచింది. ఇదే క్రమంలో కస్టమర్ల సంఖ్య 650 కంటే ఎక్కువకు చేరుకుంది. ప్రస్తుత ఐపీవో ద్వారా సమీకరించిన మెుత్తాన్ని దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు వినియోగించాలని నిర్ణయించింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications