Yes Bank: సుప్రీం కోర్టు తీర్పుతో భారీగా పడిపోయిన యెస్ బ్యాంక్ షేర్లు.. ఇక కోలుకోవడం కష్టమేనా..!

యెస్ బ్యాంకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. యెస్ బ్యాంక్ చేపట్టిన రూ. 8,415 కోట్ల విలువైన అడిషనల్ టైర్-1 (AT-1) బాండ్ల రద్దును గురువారం కొట్టివేసింది. ఈ పరిణామంతో ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యెస్ బ్యాంక్ షేర్లు 15% పడిపోయాయి. అక్టోబర్ 15న మధ్యాహ్నం 2:45 గంటల సమయానికి యెస్ బ్యాంక్ షేర్లు 15% క్షీణించి ఒక్కొక్కటి రూ. 18.02 వద్ద ట్రేడవుతున్నాయి. యెస్ బ్యాంక్‌లో దాదాపు 25% వాటాను కలిగి ఉన్న SMBC (సుమిటోమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్), సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తలెత్తే ఈ ఆర్థిక బాధ్యతను ముందే ఊహించిందో లేదో ప్రస్తుతం స్పష్టత లేదు. గమనించాల్సిన విషయం ఏమిటంటే గత ఏడాది మే నెలలో జపాన్‌కు చెందిన రెండవ అతిపెద్ద ఆర్థిక సంస్థ SMBC, యెస్ బ్యాంక్‌లో 20% వాటాను కొనుగోలు చేయడానికి అంగీకరించింది.

ఆ తర్వాత ఆగస్టులో, ఈ వాటాను 24.99% వరకు పెంచుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుమతి ఇచ్చింది. యెస్ బ్యాంక్‌లో SMBC చేసిన మొత్తం పెట్టుబడి దాదాపు రూ. 17,000 కోట్లుగా ఉంది.యెస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ చేపట్టిన AT-1 బాండ్ల రద్దు చట్టవిరుద్ధమని మరియు ఏకపక్షమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది భారత ప్రభుత్వం గెజిట్ ద్వారా ప్రకటించిన 'ఫైనల్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్' కు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం నియంత్రణపరమైన అనిశ్చితిని సృష్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందిని అంచనా వేస్తున్నారు.

Yes Bank

ఏటీ-1 బాండ్లకు మెచ్యూరిటీ తేదీ ఉండదు. ఈ రుణ సాధనాలు అధిక రాబడిని అందిస్తాయి. కానీ అధిక నష్టభయాన్ని కూడా కలిగి ఉంటాయి. మార్చి 2020లో బెయిలౌట్‌లో భాగంగా యెస్ బ్యాంక్ రూ. 8,415 కోట్ల విలువైన ఏటీ-1 బాండ్లను రద్దు చేసింది. అటువంటి నిర్ణయం తీసుకునే అధికారం అడ్మినిస్ట్రేటర్‌కు లేదని పేర్కొంటూ బాండ్లను రద్దు చేయాలన్న యెస్ బ్యాంక్ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు 2023 జనవరి 20న కొట్టివేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన యెస్ బ్యాంక్ తుది పునర్నిర్మాణ పథకం పరిధిలోకి ఏటీ-1 బాండ్ల రద్దు రాదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లింది యెస్ బ్యాంక్. బాండ్లను రద్దు చేయడాన్ని కొట్టివేస్తూ బాంబే హైకోర్టు 2023లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+