Wipro: పెట్టుబడిదారులను నిండా ముంచిన విప్రో.. 55 శాతం పడిపోయిన స్టాక్..!

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో లిమిటెడ్ షేర్లు గత ఐదేళ్లలో భారీగా పడిపోయాయి. 2021 చివరలో నమోదైన గరిష్ట స్థాయి నుంచి 55 శాతం వరకు పడిపోయాయి. ఈ ఐటీ స్టాక్ 2021 అక్టోబర్ 14న రూ. 369.93 వద్ద రికార్డు స్థాయిని తాకింది. ప్రస్తుతం ఈ స్టాక్ బలహీన ధోరణిలో కొనసాగుతోంది. ఇది 5, 10, 20, 30, 50, 100, 150, 200 రోజుల మూవింగ్ యావరేజ్‌ల కంటే తక్కువ స్థాయిలో ట్రేడ్ అవుతోంది. విప్రో స్టాక్ ఈ ఏడాది 38 శాతం నష్టపోయింది. గత ఐదేళ్లలో 51 శాతం మేర క్షీణించింది. ప్రస్తుత ట్రేడింగ్ సెషన్‌లో విప్రో షేర్లు రూ. 163.35 గా ఉంది. అంటే 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. విప్రో మార్కెట్ విలువ రూ. 1.63 లక్షల కోట్లకు తగ్గింది. పదేళ్ల సుదీర్ఘ కాలంలో ఈ ఐటీ స్టాక్ 82 శాతం సానుకూల రాబడి అందించింది.

దీని RSI 35.1 వద్ద ఉంది. అంటే స్టాక్ 'ఓవర్‌సోల్డ్ జోన్' (అధికంగా అమ్ముడైన స్థాయి)కు దగ్గరగా ట్రేడ్ అవుతోంది. కంపెనీకి చెందిన మొత్తం 3.82 లక్షల షేర్లు చేతులు మారాయి. దీని విలువ రూ. 6.36 కోట్లుగా నమోదైంది. విప్రో స్పష్టమైన క్షీణత ధోరణిలో ఉందని బొనాంజా పోర్ట్‌ఫోలియోకు చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ కునాల్ కాంబ్లే అన్నారు. ఈ పరిస్థితికి కేవలం కంపెనీ పనితీరు మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ పరిణామాలు కూడా ప్రధాన కారణమన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, అమెరికాలో కఠినమైన ద్రవ్య విధానాలు అమలుకావడం భారతీయ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అంచనా వేశారు.

Wipro

అమెరికా కంపెనీలు తమ టెక్నాలజీ బడ్జెట్‌ను కుదించుకోవడం, విచక్షణాత్మక వ్యయాలను వాయిదా వేయడం విప్రో లాంటి సంస్థల ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. రూ. 171 స్థాయిని దాటి బలంగా పైకి కదిలితే, రూ. 175 స్థాయికి పెరిగే అవకాశం ఉంటుందని ఆనంద్ రాఠీకి చెందిన జిగర్ పటేల్ అన్నారు. స్వల్పకాలంలో ఈ స్టాక్ రూ. 160 - రూ. 175 పరిధిలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందన్నారు. బిజినెస్ కోసం అమెరికా మార్కెట్లపైనే అత్యధికంగా ఆధారపడే విప్రోకు ఈ పరిస్థితులు పెద్ద ఎదురుదెబ్బగా మారాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త కొనుగోళ్లకు దూరంగా ఉండాలని, స్టాక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున ఇన్వెస్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో కోలుకోవడానికి సమయం పట్టేలా ఉండటంతో.. ఇన్వెస్టర్లు ఈ స్టాక్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలన్నారు.

కఠినమైన అమెరికా ద్రవ్య విధానంపై ఆందోళనలు ఈ రంగానికి ఎదురవుతున్న సవాళ్ల పరంపరకు తోడవడంతో, విప్రోతో సహా భారతీయ ఐటీ స్టాక్‌లు ఒత్తిడిలో ఉన్నాయి. రుణ వ్యయాలు అధికంగా ఉన్నందున విదేశీ క్లయింట్లపై ఎక్కువగా ఆధారపడే ప్రధాన భారతీయ ఐటీ సేవల కంపెనీల ఆదాయ వృద్ధిని ప్రభావితం చేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల కలిగే అంతరాయం మరియు కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ సంఘర్షణతో సహా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారతీయ ఐటీ స్టాక్‌లు ఇప్పటికే ఒక కష్టతరమైన సంవత్సరాన్ని ఎదుర్కొంటున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+