Multibagger Stock: సంవత్సర కాలంలో రూ. 34 నుంచి రూ.283 పెరిగిన కండోమ్ తయారీ కంపెనీ షేర్ ధర..
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు చాలా రిస్క్ తో కూడుకున్నవిగా ఉంటాయి. ఏ స్టాక్ ఎప్పుడు పడిపోతుందో ఎవరు చెప్పలేరు. ఎస్టాక్ ఎప్పుడు ఎవరు అంచనా వేయలేరు. అయితే ఫండమెంటల్ బలంగా ఉన్న స్టాక్స్ ఎంచుకుని పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయని పేర్కొంటున్నారు. మల్టీబ్యాగర్ రిటర్నస్ ఇస్తున్న కంపెనీల్లో ప్రముఖ ఫార్మా కంపెనీ క్యూపిడ్ ఒకటి. ఈ కంపెనీ ప్రమోటర్ అయిన ఆదిత్య కుమార్ హల్వాసియా కంపెనీలో తన వాటాను పెంచుకున్న తర్వాత క్యుపిడ్ షేర్ ధర పెరుగుతూనే ఉంది. మల్టీబ్యాగర్ స్టాక్ ఇప్పటికే ఒక నెలలో 36 శాతానికి పైగా పెరిగింది. గత వారం 52 వారాల గరిష్టాన్ని తాకింది.
గురువారం షేరు ధర దాని మునుపటి ముగింపు ధర కంటే దాదాపు 0.9% పెరిగి, ఒక్కొక్కటి రూ. 286.80 వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. అయితే వరుసగా రెండు రోజుల ర్యాలీ తర్వాత ఈ స్టాక్ అధిక స్థాయిలలో ప్రాఫిట్ బుకింగ్‌ను చవి చూసింది. క్యుపిడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య కుమార్ హల్వాసియా కంపెనీలో తన వాటాను రెండు విడతలుగా పెంచుకున్నారు. ఆగస్ట్ 17న హల్వాసియా 13,95,538 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. కంపెనీ చేసిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా కంపెనీలో 0.10 శాతం వాటాను సూచిస్తుంది.

ప్రమోటర్ ఓపెన్ మార్కెట్ ద్వారా ఆగస్టు 18న మరో 0.06% వాటాను లేదా 8,03,000 షేర్లను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లతో కంపెనీలో హల్వాసియా వ్యక్తిగత షేర్ హోల్డింగ్ 33.45%కి పెరిగింది. క్యుపిడ్‌లో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ మొత్తం వాటా 46.40% వద్ద ఉంది. క్యూపిడ్ షేరు మల్టీబ్యాగర్ రాబడిని సృష్టించింది. ఆగస్ట్ 14, 2026న, BSEలో ఈ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ.298.95ను తాకింది.
మూడు నెలల్లో స్టాక్ 137 శాతం పెరిగింది. ఆరు నెలల్లో 233% పెరిగింది. క్యూపిడ్ షేర్లు ఒక సంవత్సరంలో దాదాపు 750% పెరిగాయి. గత గత మూడు సంవత్సరాలలో 8,742% పెరిగాయి.
క్యూపిడ్ స్టాక్ ప్రైస్ 2025 ఆగస్ట్ 21న రూ.34.27 గా ఉండేది. అదే స్టాక్ 2026 ఆగస్ట్ 21 నాటికి రూ.283 చేరింది. అయితే ఒక స్టాక్ హై వాల్యూవేషన్ వద్ద పెట్టుబడి పెట్టబడి పెడితే ప్రమాదమని నిపుణులు చూస్తున్నారు. పెరిగిన స్టాక్ లో కంటే పెరిగే స్టాక్ లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అయితే చాలా మందికి కంపెనీల మీద ఐడియా ఉండదు. అలాంటి వారు నిపుణులను సంప్రదించి పెట్టుబడి పెట్టాలి. లేదంటే.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications