Tata: చంద్రశేఖరన్ రాజీనామాతో భారీగా పడిపోయిన టీసీఎస్, టాటా కన్స్యూమర్, టైటాన్ షేర్లు..!
టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ రాజీనామాను చేయడంతో టాటా గ్రూప్ స్టాక్స్ పై ప్రభావం చూపింది. బుధవారం టీసీఎస్, టైటాన్ వంటి టాటా గ్రూప్ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అయితే ఆయన తన ప్రస్తుత పదవీకాలాన్ని పూర్తి చేస్తారు. కానీ తిరిగి నియామకం కోసం ప్రయత్నించరు. ముడి చమురు ధరలు పెరగడం వల్ల పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినడం, ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సాధారణ బలహీనత కారణంగా కూడా ఈ అమ్మకాలు జరిగాయి. చంద్రశేఖరన్ రాజీనామా ప్రకటన తర్వాత ఇండియా అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతి సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లు దాదాపు 5 శాతం పడిపోవడంతో, టాటా షేర్లు నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో నిలిచాయి. ఉదయం 11:05 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో ఈ షేరు ధర 4.55 శాతం తగ్గి రూ. 2,336.90 వద్ద నమోదైంది.
దీని తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 1.6 శాతం, టైటాన్ కంపెనీ 1.3 శాతం మేర నష్టపోయాయి. టాటా స్టీల్ 1.13 శాతం, ఇండియన్ హోటల్స్ కంపెనీ షేర్లు 1.04 శాతం తగ్గాయి. టాటా టెక్నాలజీస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేర్లు 1 శాతం వరకు పడిపోయాయి. ఆగస్టు 18న జరగనున్న వార్షిక సాధారణ సమావేశంలో (AGM) చంద్రశేఖరన్ పునర్నియామకంపై వాటాదారులు ఓటు వేయాల్సి ఉండగా, గ్రూప్ స్వచ్ఛంద సేవా విభాగమైన 'టాటా ట్రస్ట్స్' చైర్మన్ నోయెల్ టాటా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో, టాటా సన్స్ ఫిబ్రవరిలోనే ఆయన పునర్నియామకంపై నిర్ణయాన్ని వాయిదా వేసిందని సమాచారం.

చంద్రశేఖరన్ 1987లో టాటా గ్రూప్‌లో చేరారు. 2009లో TCS సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు 18న జరగనున్న వార్షిక సాధారణ సమావేశానికి ముందే పదవి నుంచి తప్పుకునే అవకాశం గురించి చంద్రశేఖరన్ అంతకుముందే తన సన్నిహితులతో చర్చించారు. ఛైర్మన్‌గా ఆయన పదవీకాలం అధికారికంగా ఫిబ్రవరి 2027 వరకు ముగిసేంత వరకు ఆయన పదవిలో కొనసాగుతారని తెలుస్తోంది. చంద్రశేఖరన్ పదవీకాలంలో టాటా గ్రూప్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గ్రూప్ అందించిన గణాంకాల ప్రకారం మొత్తం రాబడి FY20లో రూ.7.89 లక్షల కోట్ల నుంచి FY26 నాటికి రూ.16.24 లక్షల కోట్లకు పెరిగింది.
పన్ను తర్వాత లాభం రూ.32,000 కోట్ల నుంచి రూ.1.71 లక్షల కోట్లకు, అంటే ఐదు రెట్లకు పైగా పెరిగింది. టాటా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ FY20లో రూ.9.31 లక్షల కోట్ల నుంచి FY26 నాటికి రూ.24.39 లక్షల కోట్లకు పెరిగింది. అయితే FY25లో ఇది రూ.27.85 లక్షల కోట్లుగా ఉంది. టీసీఎస్‌కు నాయకత్వం వహించిన తర్వాత చంద్రశేఖరన్ 2017లో టాటా సన్స్ బాధ్యతలు స్వీకరించారు. రతన్ టాటా తర్వాత, టాటా కుటుంబం వెలుపల నుంచి ఈ హోల్డింగ్ కంపెనీకి నాయకత్వం వహించిన మొదటి వ్యక్తి చంద్రశేఖరన్ నిలిచారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications