Sigma Advanced Systems Ltd: అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయిన సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ షేర్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్ లో సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ షేర్లు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. ఇటీవల కొనుగోలు చేసిన తన యూకే అనుబంధ సంస్థ బ్రోమ్‌ఫోర్డ్ ప్రెసిషన్ సొల్యూషన్స్ ద్వారా రోల్స్-రాయిస్‌తో 125 మిలియన్ యూరోలు అంటే దాదాపు రూ.1,600 కోట్ల దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఇటీవల కుదుర్చుకున్న 300 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ.3,800 కోట్ల రోల్స్-రాయిస్ దీర్ఘకాలిక ఒప్పందానికి ఇది కొనసాగింపు అని కంపెనీ తెలిపింది. ఇది కీలకమైన ఏరోస్పేస్ ప్రోగ్రామ్‌లలో గ్రూప్ ఉత్పత్తి శ్రేణిని, తయారీ సామర్థ్యాన్ని, కంటెంట్‌ను విస్తృతం చేస్తుంది.
ఈ ఒప్పందాలు కలిసి రోల్స్-రాయిస్ యూకే సరఫరా చైన్ లో సిగ్మా స్థానాన్ని గణనీయంగా బలోపేతం చేయడంతో పాటు, దీర్ఘకాలిక ఆదాయ స్పష్టతను పెంచుతాయని కంపెనీ పేర్కొంది.
బ్రోమ్‌ఫోర్డ్ కొనుగోలుతో ఏరో ఇంజిన్ రింగులు, కేసింగ్‌లు, ఇంకా అధునాతన ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో అత్యంత అనుకూలమైన తయారీ సామర్థ్యాలు కూడా తోడయ్యాయన తెలిపింది. ఇది సిగ్మాకు సంక్లిష్టమైన ఇంజిన్ భాగాల విస్తృత పోర్ట్‌ఫోలియోను సరఫరా చేయడానికి వీలు కల్పిస్తుందని సిగ్మా ప్రకటించిది. ఈ ఒప్పందం ప్రకారం రోల్స్-రాయిస్ ఆదేశాల మేరకు, బ్రోమ్‌ఫోర్డ్ సంస్థ సిగ్మా భారతదేశం, యూకే తయారీ కేంద్రాలలో ఏరోఇంజిన్ రింగులు, కేసింగ్‌లు, లాక్ ప్లేట్లు, ఇతర కీలకమైన ఇంజిన్ నిర్మాణాలను తయారు చేస్తుంది.

తద్వారా మరింత సమగ్రమైన ద్వంద్వ-మూల పరిష్కారాన్ని అందిస్తుందని ఆ సంస్థ వివరించింది. ఇండియా ప్రెసిషన్ ఇంజనీరింగ్, రక్షణ-ఏరోస్పేస్ తయారీ రంగం ఎంతగా అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఈ ఒప్పందం మరో బలమైన నిదర్శనమని సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కాలిదిండి చెప్పారు. రోల్స్-రాయిస్ వంటి గ్లోబల్ OEMలు కేవలం వ్యయ ప్రయోజనం కోసమే కాకుండా, ఇంజనీరింగ్ నైపుణ్యం, నాణ్యత, విస్తృత ఉత్పత్తి కోసం కూడా భారతదేశం వైపు ఎక్కువగా చూస్తున్నాయని అన్నారు. బ్రోమ్‌ఫోర్డ్ ప్రత్యేకమైన యూకే సామర్థ్యాలను తమ సమీకృత భారత తయారీ నెట్‌వర్క్‌తో కలపడం ద్వారా, నిజమైన గ్లోబల్ పరిష్కారాన్ని అందించగలగుతామని పేర్కొన్నారు.
మంగళవారం నాడు సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ షేర్లు ఒక్కోటి రూ.692.7 వద్ద 5% అధికంగా ట్రేడవుతున్నాయి. గత నెలలో ఇది 26.1% లాభపడగా ఈ ఏడాది ఇప్పటివరకు 269 శాతం పెరిగింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications