Indoco Remedies: ఒక్క రోజులో 13 శాతం, రెండు వారాల్లో 16 శాతం పెరిగిన స్టాక్ ఇదే..!
బుధవారం ఇండోకో రెమెడీస్ షేర్లు 13 శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. ఈ ఫార్మా కంపెనీ షేరు గత వారం రోజుల్లో 13.21 శాతం, గత రెండు వారాల్లో 16.25 శాతం రాబడి ఇచ్చింది. ఈ రోజు ట్రేడింగ్‌లో రూ.226.75 వద్ద కనిష్ట స్థాయి వద్ద ప్రారంభమైన షేరు, సెషన్ సమయంలో గరిష్టంగా రూ.254.75 స్థాయికి చేరుకుంది. ఈ భారీ పెరుగుదల మార్కెట్ దృష్టిని ఆకర్షించింది. సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం షేరులో వేగం పుంజుకోవడం, బలమైన ట్రేడింగ్ వాల్యూమ్‌లు నమోదు కావడం, కీలకమైన రెసిస్టెన్స్ స్థాయిలను దాటడం వంటి అంశాలు దీని తదుపరి గమనాన్ని నిర్ణయించనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
కేవలం 14 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ షేరు తన కనిష్ట స్థాయి రూ.205.10 నుంచి దాదాపు 24 శాతం పుంజుకుందని ఎస్బీఐ సెక్యూరిటీస్‌లో టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ సుదీప్ షా తెలిపారు. ఈ కోలుకునే క్రమంలో ఇది తన కీలక మూవింగ్ యావరేజ్‌ల కంటే పైకి చేరుకుందని పేర్కొన్నారు. ఇది స్వల్పకాలిక వేగం మెరుగుపడిందని సూచిస్తోందని వివరించారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ షేరు రూ.205-288 శ్రేణిలోనే కదులుతూ ఒక నిర్దిష్ట పరిధికి పరిమితమై ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయన అంచనా ప్రకారం రూ.230-233 స్థాయి బలమైన సపోర్ట్‌గా పనిచేస్తుందని భావిస్తున్నారు.

ఇండోకో రెమెడీస్ ఒక సమాంతర ఛానెల్లో ట్రేడ్ అవుతుందని సహి రీసెర్చ్ హెడ్ గౌరవ్ అరోరా చెప్పారు. బుధవారం సెషన్లో 12 శాతం లాభపడిందని పేర్కొన్నారు. ఈ షేరు కీలక రెసిస్టెన్స్ స్థాయి అయిన రూ.235ని అధిగమించిందని, దీనికి బలమైన ట్రేడింగ్ వాల్యూమ్‌లు తోడయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ షేరు రూ.280-285 స్థాయిల వైపు పయనించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. రూ.235 స్థాయి పైన షేరు నిలకడగా ఉన్నంత కాలం దాని సాంకేతిక నిర్మాణం సానుకూలంగానే ఉంటుందని, ప్రస్తుతం ఈ రూ.235 స్థాయి ఒక సపోర్ట్ లెవల్‌గా మారిందని ఆయన వివరించారు. స్వల్పకాలంలో, ఈ పెరుగుదల బహుశా 270 వరకు విస్తరించవచ్చ అంచనా వేశారు. 230 వద్ద ఉన్న 89 EMA మద్దతుగా పనిచేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆదాయం, నిర్వహణ పనితీరులో వృద్ధి మద్దతుతో FY27 రెండో త్రైమాసికంలో ఇండోకో రెమెడీస్ తిరిగి లాభదాయకతను సాధించిన తర్వాత కూడా ఈ ఇటీవలి ర్యాలీ వచ్చిందన్నారు. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.19.5 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.9.2 కోట్ల నికర నష్టంతో పోలిస్తే ఇది ఎక్కువగా ఉంది. ఎబిట్డా 10 శాతం పెరిగి రూ.33 కోట్లకు చేరింది. ఇది ఒక సంవత్సరం క్రితం రూ.30.2 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలోని 6.4 శాతం నుంచి కంపెనీ ఎబిట్డా మార్జిన్ కూడా స్వల్పంగా మెరుగుపడి 6.5 శాతానికి చేరింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications