PB Fintech: 6 రోజుల్లో 48 శాతం పడిపోయిన పీబీ ఫిన్ టెక్ షేర్లు..!
పాలసీబజార్, పైసాబజార్‌ల మాతృ సంస్థ అయిన పీబీ ఫిన్‌టెక్ షేర్లలో కొద్ది రోజులుగా ఒత్తిడి కనిపిస్తోంది. అక్టోబర్ 1 గురువారం నాటి ట్రేడింగ్‌లో మరో ఈ స్టాక్ 8 శాతం పతనమై రూ.980కి చేరింది. 2024 ఫిబ్రవరిలో ఉన్న కనిష్ట స్థాయికి చేరుకుంది. గత వారం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) బీమా కమిషన్ నిబంధనలలో సమగ్ర మార్పులను ప్రతిపాదించిన తర్వాత ఈ స్టాక్ వార్తల్లో నిలిచింది. డిసెంబర్‌లో ఇన్సూరెన్స్ సవరణ బిల్లు 2025 ఆమోదం పొందింది. దీనీ వల్ల బీమా మధ్యవర్తులకు(ఏజెంట్లు) కమీషన్ తగ్గే అవకాశం ఉంది.
ప్రతిపాదిత కమీషన్ కోతలు గతంలో అంచనా వేసిన దానికంటే కంపెనీ నికర లాభాలను చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయని విశ్లేషకులు హెచ్చరించారు. దీంతో వారు తమ ఆదాయ అంచనాలను భారీగా తగ్గించారు. ఈ సవరణలు వారం రోజుల్లో స్టాక్ సాధించిన ఇటీవలి లాభాలను తుడిచిపెట్టాయి. స్టాక్‌ను కలిగి ఉన్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల రాబడులను కూడా దెబ్బతీశాయి. నేటి పతనంతో స్టాక్ వరుసగా ఆరు సెషన్లలో నష్టాలను చవిచూసింది. ఈ స్టాక్ 6 సెషన్లలో 48 శాతం క్షీణించింది. ఈ స్టాక్ నవంబర్ 2021లో లిస్టింగ్ అయినప్పటి నుంచి ఇది అతిపెద్ద సవాల్ ఎదుర్కుంటుంది.

ఈ స్టాక్ ఇప్పుడు IPO ధరకు తగ్గింది. ఇంట్రాడే సెషన్‌లో స్టాక్ స్వల్పంగా కోలుకోవడానికి ముందు దాని ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయింది. ఈ స్టాక్ దేశీయ మ్యూచువల్ ఫండ్‌లకు కూడా గణనీయమైన నష్టాలను కలిగించాయి. ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, జూన్ త్రైమాసికం చివరి నాటికి, 37 మ్యూచువల్ ఫండ్‌లు సమిష్టిగా కంపెనీలో 28.32% వాటాను కలిగి ఉన్నాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో వారు కలిగి ఉన్న 15.86% వాటాకు దాదాపు రెట్టింపు. గురువారం నాటి స్టాక్ ముగింపు ధర ఆధారంగా, ఈ పతనం మ్యూచువల్ ఫండ్ సంస్థలకు దాదాపు రూ.11,726 కోట్ల నష్టాన్ని మిగుల్చింది.
కంపెనీలో వాటాలు కలిగి ఉన్న కొన్ని కీలక మ్యూచువల్ ఫండ్‌లలో 4.87 శాతం వాటాతో HDFC మ్యూచువల్ ఫండ్ అగ్రస్థానంలో ఉంది. 3.45 శాతం వాటాతో మిరే అసెట్ లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్ రెండో స్థానంలో ఉంది. 1.82% వాటాతో టాటా డిజిటల్ ఇండియా ఫండ్ మూడో స్థానంలో ఉంది. ప్రపంచ, దేశీయ బ్రోకరేజ్ సంస్థలు రెండూ తమ FY27, FY28 ఆదాయ అంచనాలను దాదాపుగా మార్చకుండా, ఈ స్టాక్ కోసం తమ టార్గెట్ ధరలను తగ్గించాయి. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తన టార్గెట్ ధరను 25 శాతం తగ్గించి రూ.1,540కి చేర్చగా, బెర్న్‌స్టీన్ తన మునుపటి టార్గెట్‌ను కొనసాగించిన కొద్ది రోజులకే రూ.2,310 నుంచి 53% తగ్గించి రూ.1,085కి చేర్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
