PB Fintech: భారీగా పడిపోయిన పాలసీ బజారు షేర్లు.. రెండు రోజుల్లో 40 శాతానికి పైగా పడిపోయిన స్టాక్..
ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ పాలసీ బజార్ స్టాక్ లో తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. గురువారం పీబీ ఫిన్ టెక్ షేర్లు ఏకంగా 34 శాతం పడిపోయాయి. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో పాలసీ బజార్ ఫిన్‌టెక్ లిమిటెడ్ షేర్లు అస్థిరంగా ప్రారంభమయ్యాయి. నిన్న ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఇన్సూరెన్స్ పంపిణీ నిబంధనలకు సంబంధించి సమగ్ర మార్పులను ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉదయం 10 గంటల 37 నిమిషాలకు ఈ కంపెనీ షేర్లు ఒక్కో షేరు 7.29 శాతం పడిపోయి రూ. 1,119 వద్ద ట్రేడవుతున్నాయి.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా బీమా కంపెనీల స్టాక్స్ పడిపోయాయి. ఐఆర్‌డీఏఐ బీమా పంపిణీ ఛార్జీలకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొస్తుండటంతో ఈ రంగం షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఈ ప్రతిపాదిత నిబంధనలు ఆయా సంస్థల డిస్ట్రిబ్యూషన్ వ్యాపార ఆదాయంపై ప్రభావం చూపొచ్చన్న అంచనాలతో షేర్లు భారీగా పతనం అయినట్లు తెలుస్తోంది. పంపిణీదారుల కమీషన్లు, రివార్డులపై స్పష్టమైన పరిమితులను కూడా IRDAI ప్రతిపాదించింది. ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ కింద పంపిణీదారులకు చేసే అన్ని చెల్లింపులను పరిగణనలోకి తీసుకోవాలని కూడా సూచించింది.

ఈ ప్రతిపాదిత మార్పులు పీబీ ఫిన్‌టెక్ వంటి ఇన్సూరెన్స్ పంపిణీదారులపై చూపే ప్రభావంపై ఆందోళనలను రేకెత్తించాయి. IRDAI ప్రతిపాదించిన బీమా పంపిణీ సంస్కరణలు, ముఖ్యంగా నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో పాలసీబజార్ వ్యాపార ఆర్థిక అంశాలపై ఆందోళనలను రేకెత్తించడంతో, బ్రోకరేజ్ సంస్థలు PB ఫిన్‌టెక్‌పై తమ ధరల లక్ష్యాలను భారీగా తగ్గించాయి. ఈ క్రమంలోనే రూ. 1886.30 స్టాక్ ప్రైస్ గురువారం పడిపోయాయి. మొదటగా 10 శాతం ఆ తర్వాత 20 శాతం పడిపోతూ చివరికి 36 శాతానికిపైగా పడిపోయింది. ఈ రోజు కూడా దాదాపు 8 శాతం పడిపోయింది. పీబీ ఫిన్ టెక్ టార్గెట్ ప్రైస్ పై HSBC అత్యంత భారీగా కోతను విధించింది. తన లక్ష్యాన్ని 45% మేర తగ్గించి రూ. 2,100 నుంచి రూ. 1,150కి తగ్గించింది. ఈ స్టాక్ రేటింగ్‌ను బై రేటింగ్ నుంచి హోల్డ్ కు తగ్గించింది.
BofA తన 'న్యూట్రల్' రేటింగ్‌ను కొనసాగించినప్పటికీ, లక్ష్యాన్ని 28.4% మేర తగ్గించి రూ. 1,970 నుంచి రూ. 1,410కి చేర్చింది. జెఫరీస్ 'బై' రేటింగ్‌ను కొనసాగించినప్పటికీ, లక్ష్యాన్ని 24.9% మేర తగ్గించి రూ. 2,050 నుండి రూ. 1,540కి చేర్చింది. ఈ ప్రతిపాదిత నిబంధనలు PB ఫిన్‌టెక్‌పై భారం మోపవచ్చు. ఎందుకంటే, కఠినమైన కమీషన్ పరిమితులు పంపిణీ రాబడులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కంపెనీ రాబడి వృద్ధి, మార్జిన్‌లపై ఒత్తిడిని పెంచవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
