Paytm: లిస్టింగ్ తర్వాత మొదటిసారి రూ.1903కు చేరిన పేటీఎం షేర్లు..!
పేటీఎం మాతృ సంస్థ అయిన 'వన్ 97 కమ్యూనికేషన్స్' షేర్ ధర, గురువారం జరిగిన ఇంట్రాడే ట్రేడింగ్‌లో భారీ లావాదేవీల మధ్య 7 శాతం పెరిగి రూ.1,903.05 కు చేరింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలపై కొత్త 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR) విధానం అమలులోకి వస్తుందనే ఆశలే ఈ ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. 2021 నవంబర్ 18న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన తర్వాత, ఈ ఫిన్‌టెక్ కంపెనీ షేర్ ధర రూ.1,900 స్థాయిని దాటడం ఇదే మొదటిసారి. కంపెనీ తన ఐపీఓ (IPO)లో షేర్లను రూ.2,150 ధర వద్ద జారీ చేసింది. అప్పట్లో లిస్టింగ్ రోజున ఈ షేర్ గరిష్టంగా రూ.1,961.05 వరకు చేరుకుంది. గురువారం నాటి ఈ పెరుగుదలతో, అక్టోబర్ 26న నమోదైన కనిష్ట స్థాయి రూ.1,582.95 నుండి ఈ స్టాక్ 20 శాతం పుంజుకుంది.
ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కలిపి మొత్తం 6.68 మిలియన్ల షేర్లు చేతులు మారాయి. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ అమలు కానుందనే అంచనాలతో మార్చి 30న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి రూ.947.10 నుంచి సెప్టెంబర్ 16 నాటికి పేటిఎం షేర్ ధర 96 శాతం పెరిగి రూ.1,856.50కి చేరుకుంది. కాగా, అక్టోబర్ 15 నుండి కొన్ని రకాల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ను అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ, దానికి రెండు రోజుల ముందు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ నిర్ణయాన్ని దీపావళి తర్వాత వరకు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా యూపీఐ ద్వారా రూ.2,000 పైబడిన పర్సన్-టు-మర్చంట్ (P2M) లావాదేవీలపై ప్రతిపాదిత 40 బేసిస్ పాయింట్ల (bps) ఎండీఆర్ అమలు తేదీపై స్పష్టత రాలేదు.

ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న బ్యాంకులు, దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి పెట్టుబడిగా పెడతామని సూచించాయి. ఇది వారి ఆదాయాన్ని లేదా లాభదాయకతను పెంచడానికి కాకుండా, ప్లాట్‌ఫారమ్‌ను మరింత విస్తరించడానికి, ఎక్కువ మంది వ్యాపారులను చేర్చుకోవడానికి, దాని భద్రత, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. త్వరలో యూపీఐపై ఎండీఆర్ అమల్లోకి వస్తున్నందున (ఖచ్చితమైన అమలు తేదీ ఇంకా వెల్లడి కాలేదు), జెఫరీస్‌లోని విశ్లేషకులు FY28 నుంచి దాదాపు రూ.800 కోట్ల నుంచి రూ.850 కోట్ల వరకు కొత్త ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ స్టాక్‌పై 'బై' రేటింగ్‌ను కొనసాగిస్తూ, రూ.2,150 టార్గెట్ ప్రైస్ ఇచ్చింది రెలిగేర్ బ్రోకింగ్‌లో ఎస్‌విపి-రీసెర్చ్. ఈ స్టాక్ తన స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌ల కంటే పైన ట్రేడ్ అవుతోందని పేర్కొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications