Health Care Stocks: శుక్రవారం 4 శాతం పెరిగిన హెల్త్ కేర్ స్టాక్స్ ఇవే..!
విస్తృత ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నప్పటికీ శుక్రవారం నాడు హెల్త్‌కేర్ స్టాక్స్ దృష్టిని ఆకర్షించాయి. మోల్బియో డయాగ్నోస్టిక్స్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్, ఆస్టర్ డిఎం క్వాలిటీ కేర్ షేర్లు 4 శాతం వరకు పెరిగాయి. అపోలో హాస్పిటల్స్, మాక్స్ హెల్త్‌కేర్‌లను 'అండర్‌పెర్ఫార్మ్' నుంచి 'అవుట్‌పెర్ఫార్మ్'కు అప్‌గ్రేడ్ చేసిన తర్వాత ఆసుపత్రి స్టాక్స్‌లో ఈ ర్యాలీ చోటుచేసుకుంది. మెరుగవుతున్న ఆదాయ అవకాశాలు, తక్కువ వాల్యుయేషన్లు, కొనసాగుతున్న ఆసుపత్రి సామర్థ్య విస్తరణ నుంచి వచ్చే ఆదాయ ఒత్తిడి తగ్గుతున్న నేపథ్యంలో ఈ స్టాక్స్ పలు బ్రోకరేజ్ లు సానుకూలంగా ఉన్నాయి.
మాక్వారీ అపోలో హాస్పిటల్స్‌పై తన ధర లక్ష్యాన్ని రూ.6,230 నుంచి రూ.10,500కు పెంచింది. ఇది గురువారం ముగింపు ధర నుంచి దాదాపు 20 శాతం ఎక్కువ. ఆసుపత్రి పరిశ్రమ విస్తరణ వల్ల లాభదాయకతపై పడే తొలి ప్రభావం ఇప్పటికే విలువల్లో ప్రతిబింబిస్తోందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ఆసుపత్రులు వినియోగాన్ని మెరుగుపరుచుకుంటున్న కొద్దీ, కొత్తగా చేర్చిన సామర్థ్యం మరింత గణనీయంగా దోహదపడుతుందని అంచనా వేసింది. మాక్స్ హెల్త్‌కేర్‌ను మాక్వారీ అప్‌గ్రేడ్ చేయడంతో పాటు దాని ధర లక్ష్యాన్ని రూ.825 నుంచి రూ.1,450కి భారీగా పెంచింది. ఇది 37 సాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

అయితే సుప్రీం కోర్టు ఆంకాలజీ మందులకు మించి ధరల పరిమితులను పొడిగించే అవకాశం ఉందని పేర్కొంది. ఫలితంగా లాభాలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. కొత్తగా ప్రారంభించిన ఆసుపత్రుల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ భావిస్తోంది. మాక్స్ హెల్త్‌కేర్‌కు సంస్థాగత రోగుల నిష్పత్తి పెరగడం వల్ల ఒక్కో రోగికి వచ్చే ఆదాయంపై భారం పడవచ్చని చెప్పింది. దీర్ఘకాలంలో ఆస్పత్రి స్టాక్స్ మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ అంచనా వేసింది. అయితే ఒక ఆస్పత్రిలో బెడ్లన్నీ ఫిల్ అయితే.. వచ్చే ఆదాయం పెరుగుతుందని పేర్కొంది. ఎప్పుడైన అర్ప్ చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొత్త ఆస్పత్రులు ఏర్పాటు చేయాలంటే భారీగా క్యాపిటల్ అవసరం అని.. అందువల్ల ఆస్పత్రుల స్టాక్ చూస్తున్నప్పుడు డెట్ టూ ఈక్విటీ రేషియో కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications