Jio: లిస్టింగ్ నుంచి దూసుకెళ్తోన్న జియో ప్లాట్ ఫారమ్స్ షేర్లు..!
జియో ప్లాట్ ఫారమ్స్ షేర్లు గత వారం బలమైన లిస్టింగ్ తర్వాత శుక్రవారం తన మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో సోమవారం ట్రేడింగ్ సెషన్లో కంపెనీ షేర్ ధర 3 శాతం వరకు పెరిగింది. జియో ప్లాట్‌ఫారమ్స్ షేర్లు ఈరోజు ₹1,465 వద్ద ప్రారంభమై.. గరిష్టంగా రూ.1,475 స్థాయిని తాకాయి. అక్టోబర్ 28న స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన జియో ప్లాట్‌ఫారమ్స్ అప్పుడు రూ.1,358 వద్ద లిస్ట్ అయింది. ఇది ఐపీఓ (IPO) ధర రూ.1,119తో పోలిస్తే 21.36% ప్రీమియంలో లిస్ట్ అయింది. సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి, జియో ప్లాట్‌ఫారమ్స్ తన ఏకీకృత నికర లాభంలో గత ఏడాదితో పోలిస్తే (YoY) 14% వృద్ధిని నమోదు చేసి, రూ.8,389 కోట్లకు చేరుకుంది.
స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత కంపెనీ ప్రకటించిన మొదటి త్రైమాసిక ఫలితాలు ఇవే. చందాదారుల సంఖ్య గణనీయంగా పెరగడం, డిజిటల్ సేవల వ్యాపారం విస్తరించడం, ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) స్వల్పంగా మెరుగుపడ్డాయి. కంపెనీ నిర్వహణ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 11 శాతం పెరిగి రూ.36,332 కోట్ల నుంచి రూ.40,475 కోట్లకు చేరుకుంది. జూన్ త్రైమాసికంతో పోలిస్తే (QoQ), నికర లాభం 8 శాతం పెరగ్గా.. ఆదాయం 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. అధిక ఆదాయం, నిర్వహణ సామర్థ్యం, మెరుగైన మార్జిన్ల కారణంగా, ఈ త్రైమాసికంలో కంపెనీ ఎబిట్డా 17% వృద్ధి చెందింది.

ఎబిట్డా మార్జిన్ 250 బేసిస్ పాయింట్లు పెరిగి 54.1%కి చేరుకుంది. అదే సమయంలో క్యూ2లో ARPU స్వల్పంగా పెరిగి రూ.218.8కి చేరింది. అయితే ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం అందించిన ప్రమోషనల్ ఆఫర్లు, పెరిగిన డేటా వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను కొంతవరకు తగ్గించాయి. నిర్వహణ పరంగా చూస్తే ఒక్కో వినియోగదారుడి నెలవారీ డేటా వినియోగం 44.2 GBగా నమోదైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం డేటా ట్రాఫిక్ గత ఏడాదితో పోలిస్తే 22 శాతం పెరిగింది. నెలవారీ సబ్‌స్క్రైబర్ చర్న్ 1.6% వద్ద స్థిరంగా ఉంది. ఈ కాలంలో జియో 9.1 మిలియన్ల నికర సబ్స్క్రైబర్లను చేర్చుకుంది.
సెప్టెంబర్ చివరి నాటికి జియో 5G సబ్స్క్రైబర్ల సంఖ్య 30 కోట్లకు చేరుకుంది. గత 12 నెలల్లో 6.6 కోట్ల మంది వినియోగదారులు కొత్తగా చేరారు. కస్టమర్ ఎంగేజ్మెంట్ బలంగా కొనసాగింది. కంపెనీ మొత్తం వైర్లెస్ డేటా ట్రాఫిక్‌లో 56 శాతం వాటా 5G వినియోగదారులదే.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications