Hexaware Technologies: భారీగా పెరిగిన హెక్సావేర్ టేక్నాజీస్ షేర్లు..!
హెక్సావేర్ టేక్నాజీస్ మల్టిబ్యాగర్ రిటర్న్స్ ఇస్తోంది. తాజాగా అక్టోబర్ 9 శుక్రవారం నాడు బీఎస్ఈలో ఇంట్రాడే ట్రేడింగ్ లో హెక్సావేర్ టేక్నాజీస్ షేర్లు భారీ ట్రేడింగ్ వాల్యూమ్‌తో 12 శాతం వరకు పెరిగాయి. అంతకుముందు ముగింపు ధర రూ.510.85 కాగా హెక్సావేర్ టేక్నాజీస్ షేర్ ధర రూ.533 వద్ద ప్రారంభమై 12.4 శాతం పెరిగి రూ.574.45 గరిష్ట స్థాయిని తాకింది. తద్వారా వరుసగా ఐదవ సెషన్‌లోనూ లాభాలను కొనసాగించే దిశగా సాగుతోంది. శుక్రవారం సెషన్‌లో ఈ స్టాక్ ట్రేడింగ్ వాల్యూమ్‌లో 9.83 రెట్లకు పైగా పెరుగుదల కనిపించింది. అక్టోబర్ 8, గురువారం నాడు అంథ్రోపిక్ తో బహుళ-సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం స్టాక్ ధరల్లో ఈ పెరుగుదల నమోదైంది.
హెక్సావేర్ టేక్నాజీస్ అంథ్రోపిక్ 'Claude Partner Network'లో ప్రాధాన్య భాగస్వామిగా మారింది. హెక్సావేర్ టేక్నాజీస్ వద్ద 1,100 మందికి పైగా Claude-సర్టిఫైడ్ నిపుణులు ఉన్నారు. హెక్సావేర్ టేక్నాజీస్, అంథ్రోపిక్ కలిసి మార్కెట్ ప్రవేశం ఉమ్మడి పరిష్కారాల అభివృద్ధి, కస్టమర్ డిప్లాయ్‌మెంట్‌లపై పని చేయానున్నాయి. ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 6 శాతం, బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 10% పడిపోయినప్పటికీ గత ఆరు నెలల్లో ఈ స్టాక్ 13శాతం పెరిగింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు చూస్తే సెన్సెక్స్ 15 శాతం, బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 26 శాతం పడిపోగా ఈ స్టాక్ 29 శాతం క్షీణించింది.

ఈ స్టాక్ గత ఏడాది డిసెంబర్ 4న రూ.808.40 వద్ద 52-వారాల గరిష్ట స్థాయిని, ఈ ఏడాది మార్చి 12న రూ.400.35 వద్ద 52-వారాల కనిష్ట స్థాయిని తాకింది. ఈ స్టాక్ తన ప్రధాన EMAల మధ్య నెగటివ్ క్రాస్‌ఓవర్‌లతో ట్రేడ్ అవుతోందని నిపుణులు చెబుతున్నారు. స్టాక్ పతన ధోరణిలో ఉంది. ప్రస్తుత ధరల నుంచి ఈ పతన ధోరణి కొనసాగడం చాలా వాస్తవికంగా కనిపిస్తోందని చెబుతున్నారు. పెట్టుబడిదారులు ప్రస్తుత ధరకు దగ్గరగా ఈ స్టాక్ నుండి నిష్క్రమించడం గురించి ఆలోచించాలన్నారు. రూ.585 నిరోధక స్థాయిని బలంగా దాటితేనే కొనుగోలు చేయడం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications