చమురు మంటలు, డాలర్ ధాటికి కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్.. ఒక్క రోజే రూ. 3.74 లక్షల కోట్ల సంపద ఆవిరి..

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఎగిసిపడుతున్న ముడి చమురు ధరలు, విదేశీ నిధుల ఉపసంహరణ ధాటికి భారత స్టాక్ మార్కెట్ ఆరంభ లాభాలను కోల్పోయి తీవ్ర పతనాన్ని చవిచూసింది. సెప్టెంబర్ 15, 2026, సోమవారం ఉదయం 10:15 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో నమోదు పొందిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సెప్టెంబర్ 11న ఉన్న రూ. 4,83,10,214.927 కోట్ల నుండి ఏకంగా రూ. 4,79,35,715.53 కోట్లకు పడిపోయింది. దీనితో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.3.74 లక్షల కోట్లు క్షీణించింది. మార్కెట్లో షేర్ల ధరలు పడిపోవడం వల్ల ట్రేడర్ల మార్కెట్ పోర్ట్‌ఫోలియో విలువ తగ్గడమే ఈ సంపద క్షీణతకు ప్రధాన కారణం.

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $107 మార్కును దాటడం భారతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడే భారతదేశానికి చమురు ధరల పెరుగుదల వల్ల జాతీయ వ్యయం పెరిగి, ద్రవ్యోల్బణ భయాలు ముమ్మరమయ్యాయి. దీనికి తోడు అమెరికా 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్ దిగుబడి 5.01 శాతానికి పెరిగి, 2007 తర్వాత అత్యంత గరిష్ట స్థాయిని తాకింది.

Stock Market Live Stock Market Today Share Market Today Stock Market Crash Share Market Crash Sensex Today Nifty Today Sensex Fall Nifty Fall 4 Lakh Crore Loss Market Cap Loss Crude Oil Prices Bond Yields Fed Rate Hike US Federal Reserve FII Selling Global Markets Market Sell-Off Stock Market Reasons Investors Alert Stock Market Live Stock Market Today Share Market Today Stock Market Crash Share Market Crash Sensex Today Nifty Today Sensex Fall Nifty Fall

అమెరికా బాండ్ల ద్వారా ఎక్కువ రాబడి లభిస్తుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) భారత మార్కెట్ల నుండి తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. దీనికి అదనంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.80 స్థాయికి క్షీణించడం మరియు ఆరంభ ర్యాలీ తర్వాత ట్రేడర్లు చేపట్టిన లాభాల స్వీకరణ (Profit Booking) మార్కెట్‌ను మరింత పతనానికి గురిచేసాయి.

Also Read

ఇంతటి మార్కెట్ అస్థిరతల మధ్య పలు కార్పొరేట్ రంగానికి చెందిన పరిణామాలు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించాయి. దక్షిణాఫ్రికా మైనింగ్ ఆధారిత కెమికల్స్ దిగ్గజం 'ఓమ్నియా' స్వాధీన ప్రక్రియ పూర్తికావడం ద్వారా ఆఫ్రికా మార్కెట్లలో తమ ఉనికి మరియు రాబడులు గణనీయంగా పెరుగుతాయని 'సోలార్ ఇండస్ట్రీస్' యాజమాన్యం తమ కాన్ఫరెన్స్ కాల్‌లో ధీమా వ్యక్తం చేసింది.

మరోవైపు, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగానికి చెందిన 'హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్' (HDFC Bank) కొత్త ఎండి మరియు సీఈఓ నియామకంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాబోయే 1-2 వారాల్లో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత సీఈఓ శశిధర్ జగదీషన్ పదవీకాలం అక్టోబర్ 26, 2026తో ముగియనుండటంతో, రాబోయే నాయకత్వ మార్పు బ్యాంకు భవిష్యత్ రుణ వృద్ధి మరియు డిపాజిట్ల నిర్వహణలో ఏ విధమైన పాత్ర పోషిస్తుందోనని విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+