వరుసగా మూడు రోజుల పెరుగుదల తర్వాత నేడు శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో భారీ క్షీణత కనిపిస్తోంది. ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ మూడో త్రైమాసిక ఫలితాల కారణంగా మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. ఉదయం 11 గంటల సమయంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 718.05 పాయింట్లు (0.93%) క్షీణించి 76,324.77 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ 196.20 పాయింట్లు (0.84%) క్షీణించి 23,115.60 పాయింట్ల వద్ద ఉంది. ఇనీషియల్ ట్రేడింగ్‌లో ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు 6 శాతం పడిపోయాయి. యాక్సిస్ బ్యాంక్ షేర్లు 6 శాతానికి పైగా పతనం కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి.
నిన్న గురువారం మార్కెట్ క్లోసింగ్ తర్వాత ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 11% పెరిగింది. దింతో కంపెనీ ఆదాయ అంచనాలను కూడా పెంచింది. అమెరికన్ కస్టమర్ల ఖర్చులు పెరిగే సంకేతాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇక యాక్సిస్ బ్యాంక్ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. రుణల వృద్ధి మందగించడం, బ్యాడ్ లోన్ల కారణంగా ఇలా జరిగింది. కానీ బెంచ్‌మార్క్‌లో రెండవ అతిపెద్ద స్టాక్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడవ త్రైమాసిక లాభాలు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయి. ఈ కారణంగా ఉదయం ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 4% పెరిగాయి.

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, హెల్త్‌కేర్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2% క్షీణతతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు మార్కెట్‌కు రెండు సానుకూల అంశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మొదటి విషయం ఏమిటంటే, డాలర్ ఇండెక్స్ & US బాండ్ ఈల్డ్‌లు డౌన్ ట్రెండ్. రెండవది, పెద్ద కంపెనీలు RIL ఇంకా ఇన్ఫోసిస్ మూడవ త్రైమాసిక ఫలితాలు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయి. ఈ రెండు స్టాక్స్ మార్కెట్‌లో కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. డాలర్ ఇండెక్స్ ఇంకా US బాండ్ ఈల్డ్‌లలో క్షీణత సానుకూలంగా ఉన్నప్పటికీ FIIల అమ్మకాలను నిరోధించడానికి తగ్గుదల సరిపోదు.
దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ షేర్లు దాదాపు నాలుగు శాతం పెరిగి రూ.1325.10కి చేరాయి. ఉదయం 11.30 గంటలకు 2.02 శాతం పెరిగి రూ.1294.35 వద్ద ఉంది. గురువారం అమెరికా మార్కెట్ పతనం ప్రభావం నేడు ఆసియా మార్కెట్‌పై కూడా కనిపించింది. నాల్గవ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 5.4% విస్తరించిందని అఫీషియల్ డేటా చూపడంతో చైనా స్టాక్‌లకు కొంత సపోర్ట్ లభించింది. జపాన్ నిక్కీ 1.1 శాతం పడిపోయింది. MSCI ప్రపంచ సూచీ 0.05% పడిపోయింది. ఆసియా-పసిఫిక్ ప్రాంత షేర్లలో వైడ్ ఇండెక్స్ 0.4% పడిపోయింది.
రూపాయి పతనం
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) గురువారం భారత మార్కెట్‌లో రూ.4,341 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,928 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రష్యా ఆయిల్ ఉత్పత్తిదారులపై US ఆంక్షలు ఇంకా ఫెడరల్ రిజర్వ్ అధికారుల నుండి వడ్డీ రేట్ల తగ్గింపు గురించి సంకేతాల తర్వాత వరుసగా నాల్గవ వారం లాభాల ట్రాక్‌లో చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. ఇదిలా ఉండగా ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు పడిపోయి 86.42 వద్ద ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications