IPO News: త్వరలో గోల్డ్ కంపెనీ ఐపీవో.. గోల్డెన్ ఛాన్స్ మిస్ కాకండి, పూర్తి వివరాలివే..

Shanti Gold IPO: జనవరి రెండవ వారంలో కొద్దిగా నెమ్మదించిన ఐపీవోల జోరు తిరిగి పెద్దగా స్టార్ట్ కావటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బెట్టింగ్ వేసేందుకు డబ్బు సిద్ధంగా పెట్టుకుంటున్న వారికోసం గోల్డెన్ ఛాన్సులు తిరిగి స్టార్ట్ అవుతున్నాయి. ఈక్విటీలకు దూరంగా ఐపీవోలబై బెట్ వేస్తున్న వారికి ఇదొక సదవకాశంగా చెప్పుకోవచ్చు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఐపీవో గురించే. తాజాగా కంపెనీ తన ఐపీవో కోసం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. దీంతో గోల్డ్ కంపెనీ నుంచి ఈ ఏడాది మెుదటిగా వస్తున్న ఐపీవో కావటంతో పెట్టుబడిదారుల్లో హర్షం కొనసాగుతోంది. కంపెనీ తన వ్యాపారానికి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఉత్పత్తి కేంద్రం విస్తరణ కోసం వినియోగించాలని నిర్ణయించినట్లు సెబీకి వెల్లడించింది. ఈ క్రమంలో జనవరి 13న సెబీ వద్ద డీఆర్హెచ్పీ దాఖలు చేసింది.

Shanti Gold International files Papers with SEBI to float IPO Investors ready for betting

ప్రస్తుతం తీసుకొస్తున్న ఐపీవో పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా 1.8 కోట్ల ఫ్రెష్ ఈక్విటీలను విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ దేశంలోని ప్రముఖ 22 క్యారెట్ల ఆభరణాల తయారీదారుల్లో ఒకటిగా కొనసాగుతోంది. కంపెనీ ప్రస్తుతం స్కై గోల్డ్, ఆర్బీజెడ్ జ్యూవెలర్స్, ఉత్సవ్ సీజెడ్ గోల్డ్ వంటి కంపెనీలతో పోటీ పడుతోంది. వాస్తవాని కంపెనీ 2003లో స్థాపించబడి దేశ ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలను కొనసాగితోంది.

ఐపీవో నుంచి సేకరించే మెుత్తంలో రూ.45.8 కోట్లను జైపూరులో కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ఉత్పత్తి సామర్థ్యం కోసం వినియోగించాలని ప్లాన్ చేస్తోంది. దీంతో 1200 కేజీల బంగారు ఉత్పత్తికి అవసరమైన ఏర్పాట్లను అక్కడ నెలకొల్పనుంది. దీంతో మెుత్తం కంపెనీ వద్ద బంగారం ఉత్పత్తి సామర్థ్యం 3,900 కేజీలకు పెరుగుతుందని తెలుస్తోంది. మొత్తం మీద పెళ్లి ఆభరణాలలో సాదా బంగారు ఆభరణాలు 85 శాతంగా ఉంది. జైపూర్ సౌకర్యంలోని కొత్త ఉత్పత్తి శ్రేణి సాదా బంగారు ఆభరణాల డిమాండ్‌ను తీరుస్తుందని కంపెనీ భావిస్తోంది.

అలాగే రూ.190 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, రూ.20 కోట్లు రుణాల చెల్లింపులకు వినియోగించాలని కంపెనీ నిర్ణయించింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంతవ్సరంలో కంపెనీ నికర ఆదాయం రూ.26.9 కోట్లుగా ఉంది. అలాగే వ్యాపార ఆదాయం రూ.711.4 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే కంపెనీ లాభాలు వార్షికంగా 35.6 శాతం పెరుగుదలను చూశాయి. ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా ఛాయిస్ క్యాపిటల్ అడ్వైజర్స్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ ఐపీవోపై చాలా మంది ఇన్వెస్టర్లు తమ దృష్టిని కొనసాగిస్తున్నారు.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+