Below RS.100 Stocks: రూ.100 లోపు కొనుగోలు చేయాల్సిన స్టాక్స్ ఇవేనా..!

భారత స్టాక్ మార్కెట్‌లోని కీలక బెంచ్‌మార్క్ సూచీలు గత వారం పుంజుకున్నాయి. వరుసగా ఎనిమిది వారాల పాటు నష్టాల్లో కొనసాగిన తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ సూచీలు వరుసగా రెండో వారం కూడా లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 50 సూచీ 2.8% లాభంతో ముగియగా, బీఎస్ఈ సెన్సెక్స్ గత వారం 2250 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 1.06% లాభపడి 55,844 వద్ద ముగిసింది. ఐటీ రంగం 3.92 శాతం పెరుగుదలతో లాభాలకు నాయకత్వం వహించగా, మీడియా, సిమెంట్, ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు కూడా పురోగమించాయి. మిడ్ స్మాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

దలాల్ స్ట్రీట్‌లోని ఏ-లిస్టెడ్ స్టాక్స్‌లో, టాటా ఎల్క్సీ షేర్లు దాదాపు 23% వారపు లాభాలతో అగ్రగామిగా నిలిచాయి. ఆ తర్వాత గ్యాలంట్ ఇస్పాట్ 21%, 63 మూన్స్ టెక్నాలజీస్ 20%, టిప్స్ మ్యూజిక్, టెక్ మహీంద్రా గత వారం దాదాపు 20% లాభాలను నమోదు చేశాయి. నష్టపోయిన ఏ-లిస్టెడ్ స్టాక్స్‌లో, కేఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ షేర్లు సుమారు 17% నష్టపోయి అగ్రస్థానంలో నిలిచాయి. ఆ తర్వాత యెస్ బ్యాంక్, అవలాన్ టెక్నాలజీస్ షేర్లు గత వారం దాదాపు 14% నష్టపోయాయి. హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 12.50 శాతం కంటే ఎక్కువ నష్టపోయాయి. భారత స్టాక్ మార్కెట్ ధోరణి మెరుగుపడిందని నిపుణులు అంచనా వేశారు.

Stocks

బుల్లిష్ దృక్పథాన్ని బలోపేతం చేయడానికి బ్యాంక్ నిఫ్టీ సూచీకి నిరోధకత పైన నిర్ణయాత్మక బ్రేక్‌అవుట్ అవసరమని పేర్కొన్నారు. అదే మద్దతు స్థాయి కంటే కిందకు పడిపోతే మళ్లీ అమ్మకాల ఒత్తిడి రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి స్పష్టమైన బ్రేక్‌ అవుట్ కనిపించే వరకు స్థిరీకరణ కొనసాగే అవకాశం ఉన్నందున, స్వల్పకాలిక ధోరణి జాగ్రత్తగా సానుకూలంగానే ఉంది. రూ.100 లోపు కొనవలసిన స్టాక్స్ కూడా నిపుణులు సూచించారు. రూ.100 లోపు కొనవలసిన స్టాక్స్ విషయానికి వస్తే.. మూడు షేర్లను సిఫార్సు చేశారు. ఇందులో ఐఆర్‌ఎఫ్‌సి (IRFC), మోథర్‌సన్ సుమీ వైరింగ్ ఇండియా, లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+