భారతీయ స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కొద్ది రోజులుగా కరెక్షన్ మోడ్‌లో ఉన్న సెన్సెక్స్, నిఫ్టీ సహా ఇతర సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ప్రారంభంలోనే స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా ప్రతికూల పరిస్థితుల్లోనే ట్రేడ్ అయ్యాయి. ముగింపు రోజు మంగళవారం మార్కెట్ ఊగిసలాట వివరాలు, సెన్సెక్స్, నిఫ్టీ ఏ మేరకు నష్టపోయాయనే వివరాలు ఇక్కడ ఉన్నాయి.
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ పతనం కావడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ , ఇతర అంతర్జాతీయ అంశాల ప్రభావంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో భారత ప్రధాన సూచీలు ప్రతికూలంగా స్పందించాయి. షేర్ మార్కెట్‌లో లాభాల స్వీకరణ , అమ్మకాలు కొనసాగడంతో మార్కెట్ సూచీలు భారీగా నష్టపోయాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

సెన్సెక్స్‌కు నష్టమెంత?
సెన్సెక్స్ విషయానికి వస్తే, అంతకుముందు ముగింపు 85,213 పాయింట్లతో పోలిస్తే.. ఈ రోజు 85,025 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 85,059 పాయింట్ల గరిష్ట స్థాయిని, 84,620 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 533 పాయింట్ల నష్టంతో 84,679 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ పరిస్థితి ఏంటి?
ఇక నిఫ్టీ విషయానికి వస్తే.. అంతకుముందు ముగింపు 26,277 పాయింట్లతో పోలిస్తే, సుమారుగా 70 పాయింట్లకుపైగా నష్టంతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 25,980 పాయింట్ల గరిష్ట స్థాయిని, 25,834 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 167 పాయింట్ల నష్టంతో 25,860 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
లాభపడ్డ, నష్టపోయిన ప్రధాన షేర్లు
మార్కెట్‌లో ప్రధాన షేర్లలో టైటన్ కంపెనీ (1.64 శాతం), భారతీ ఎయిర్‌టెల్ (1.56 శాతం), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (1.08 శాతం), బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్ షేర్లు ఒక శాతం కంటే తక్కువగా లాభపడ్డాయి.
ఇక ప్రధానంగా నష్టపోయిన షేర్లలో యాక్సిస్ బ్యాంక్ భారీగా.. అంటే 5 శాతానికిపైగా పతనమైంది. ఆ తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్ (4.69 శాతం), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (2.89 శాతం), హెచ్‌సీఎల్ టెక్ (1.92 శాతం), టాటా స్టీల్ (1.76 శాతం) మేర నష్టాలకు గురయ్యాయి.


Click it and Unblock the Notifications