Sensex-Nifty Recover: దేశీయంగా ఉదయం భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు ట్రెండ్ సెకండ్ హాఫ్ పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడే లో నుంచి దాదాపు 2000 పాయింట్లు రికవరీని నమోదు చేసింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ కూడా తిరిగి పుంజుకుంది. ఈ క్రమంలో టెలికాం, పవర్ రంగాలు మార్కెట్లను తిరిగి లాభాల్లోకి రావటంలో కీలకంగా వ్యవహరించాయి.
మధ్యాహ్నం 3.06 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 738 పాయింట్లు పెరగగా, మరో కీలక సూచీ నిఫ్టీ 190 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 320 పాయింట్లు లాభంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 35 పాయింట్ల నష్టంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే మార్కెట్లు అనూహ్యంగా పతనం నుంచి లాభాల్లోకి రావటానికి కారణం బ్యాంకింగ్, టెలికాం రంగాల్లోని కంపెనీల షేర్లు భారీగా ర్యాలీని నమోదు చేయటంతో సూచీలు రికవరీని నమోదు చేశాయి.

ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్, ఆటో స్టాక్‌లలో లాభాలు రికవరీకి ఆజ్యం పోశాయి. దీంతో నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్ల దిశను లాభాల్లోకి తిప్పాయి. మార్కెట్ విశ్లేషకులు అస్థిరతకు సెన్సెక్స్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల వారం గడువు ముగియడమే కారణం వల్ల ఏర్పడినవిగా పేర్కొంటున్నారు. అప్‌సైడ్‌లో షార్ట్ కవరింగ్ కారణంగా కాల్ రైటర్‌లు భారీ నష్టాలను చూసినట్లు ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్‌లోని టెక్నికల్ రీసెర్చ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మెహుల్ కొఠారి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఇంట్రాడేలో సెన్సెక్స్ సూచీ 80,000 పాయింట్ల స్థాయికి దిగజారిన సంగతి తెలిసిందే.. కానీ అనూహ్యంగా మార్కెట్లు తిరిగి పుంజుకోవటంతో తిరిగి 82,000 పాయింట్ల స్థాయికి చేరుకున్నాయి.
ఉదయం సెషన్ తిరోగమనం ఆసియా మార్కెట్లలో నష్టాలను దేశీయ స్టాక్ మార్కెట్లు ఫాలో అయ్యాయి. దీనికి తోడు యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్, బలమైన డాలర్, చైనా ఆర్థిక వ్యవస్థ వంటి కీలక అంశాలు మార్కెట్లకు దిశానిర్ఖేశం చేశాయి. దీనికి తోడు చైనా ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ గురించి ప్రకటించటం కూడా మార్కెట్లను ప్రభావిచం చేసిందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా టెలికాం మేజర్ భారతీ ఎయిర్‌టెల్ స్టాక్ 4 శాతం మేర పెరుగుదలను చూసింది. టారిఫ్ పెంపుల కారణంగా స్థిరమైన ఆదాయాలు ఊపందుకున్నాయని పేర్కొంటూ, 2025లో ఆసియాకు సంబంధించిన టాప్ పిక్స్‌లో జెఫరీస్ కంపెనీని చేర్చింది.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 888 పాయింట్లు, నిఫ్టీ సూచీ 233 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 409 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించాయి. మార్కెట్ల ముగింపులో ఎయిర్ టెల్, ఐటీసీ,కోటక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందుస్థాన్ యూనీలివర్, టైటాన్, హెచ్సీఎల్ టెక్, గ్రాసిమ్, పవర్ గ్రిడ్, నెస్లే, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్జూమర్, మారుతీ, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, ట్రెంట్ కంపెనీల షేర్లు నష్టాలతో ప్రయాణాన్ని ముగించాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications