Sensex Rally: మార్కెట్లలో మోదీ మ్యానియా.. 3000 పాయింట్లు అప్, అసలు మ్యాటర్ అదే..
Stock Market Rally: దాదాపు రెండు వారాలుగా మార్కెట్లు కరెక్షన్ మోడ్ నుంచి తిరిగి బులిష్ మోడ్‌లోకి వచ్చాయి. గత శుక్రవారం అనుహ్యంగా పెరిగిన స్టాక్ మార్కెట్లు ఏకంగా 2000 పాయింట్ల పెరుగుదలను చూశాయి. అయితే నేడు ఇంట్రాడేలో దాదాపు 1300 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ సూచీ చివరికి 992 పాయింట్ల లాభంతో ముగిసింది.
ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 315 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ బ్యాంక్ సూచీ 1072 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 884 పాయింట్ల మేర పెరుగుదలను చూసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంత బలంగా ర్యాలీని చూడటానికి కారణం బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అలయన్స్ గెలుపే కారణంగా ఉంది. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్, నిఫ్టీ బ్యాంక్ సూచీ, రియల్టీ, ఇన్ ఫ్రా, ఎనర్జీ రంగాలకు చెందిన సూచీలు దాదాపు 4 శాతం పెరుగుదలను చూశాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో మొత్తం 288 సీట్లలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 233 సీట్లు గెలుచుకోగా, జార్ఖండ్‌లో ప్రతిపక్ష కూటమి విజయం సాధించగా ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లో కనిపించిందని నిపుణులు చెబుతున్నారు.

దేశీయ స్టాక్ మార్కెట్లలో గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే అదానీ షేర్లలో రికవరీ. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో అదానీ గ్రూప్ లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ విలువలో 28 బిలియన్ డాలర్లను కోల్పోయింది. అదానీ గ్రూప్ షేర్లు ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో దాదాపు 7% ర్యాలీ చేశాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 6% పెరిగి రూ.688కి చేరుకోగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ 3-4% మధ్య లాభపడ్డాయి. అదానీ విల్మార్, అదానీ పోర్ట్స్, ఏసీసీ, అంబుజా సిమెంట్ 1-2% మధ్య ఎగబాకాయి. లంచాల ఆరోపణలపై గౌతమ్ అదానీ, సాగర్ అదానీలను విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు వచ్చిన వేళ, దేశీయంగా సుప్రీం కోర్టులో కూడా దీనికి సంబంధించి విచారణ జరపాలని దరఖాస్తులు వచ్చాయి.
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు పెరుగుదలకు కారణం.. మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్(MSCI) సూచికల్లో త్రైమాసిక పునర్వ్యవస్థీకరణ నవంబర్ 25న షెడ్యూల్ కావటం. మార్పులను అనుసరించి, భారతదేశానికి సంబంధించిన MSCI స్టాండర్డ్ ఎటువంటి మినహాయింపులు లేకుండా ఐదు స్టాక్‌లను జోడిస్తుంది. దీంతో మొత్తం కౌంట్ 156 స్టాక్‌లకు చేరుకుంది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లో 13 స్టాక్‌ల చేరిక ప్రకటించబడింది. ఈ విభాగంలో భారతదేశం ప్రాతినిధ్యం 525 స్టాక్‌లకు పెరిగింది. ఇక చివరిగా మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలుపుతో ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల షేర్లు 8% వరకు ర్యాలీని నేడు నమోదు చేశాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో ఓఎన్జీసీ, బెల్, ఎల్ టి, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, విప్రో, ట్రెంట్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా నిలవగా.. జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, మారుతీ, బజాజ్ ఆటో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో టాప్ లూజర్లుగా నేడు ట్రేడింగ్ ముగించాయి.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.


Click it and Unblock the Notifications