stockmarket update: నేడు ఉదయం గ్రీన్ మార్కులో మొదలైన స్టాక్ మార్కెట్ చివరికి లాభాలతో ముగిసింది. దింతో షేర్ మార్కెట్‌లో నష్టాల ట్రెండ్'కి బ్రేక్ పడినట్లయింది. సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల పెట్టుబడిదారుల నమ్మకం పడిపోకుండా కొంతవరకు సపోర్ట్ ఇచ్చింది. ఇవాళ దాదాపు అన్ని సూచీలు లాభాలతో ముగిశాయి. సాయంత్రం బిఎస్‌ఇ సెన్సెక్స్ 740 పాయింట్లు పెరగగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 10 రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికింది.
షేర్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 740.30 పాయింట్లు పెరిగి 73,730.23 వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 254.65 పాయింట్లు పెరిగి 22,337.30 స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, మహీంద్రా & మహీంద్రా, ఎన్‌టిపిసి, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఐటిసి, నెస్లే ఇండియా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, భారతి ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆసియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, జొమాటో షేర్లు క్షీణించాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.13%, ఆటో 2.60%, ఫార్మా 1.54%, మెటల్ 4.04%, బ్యాంక్ ఇండెక్స్ 0.51% లాభపడ్డాయి. అంతేకాకుండా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 అండ్ స్మాల్‌క్యాప్ 100 రెండూ లాభాల్లో ముగిశాయి.

షేర్ మార్కెట్ ప్రారంభానికి ముందు స్టాక్ మార్కెట్ సంకేతాలు అనుకూలంగా లేవు. మరోవైపు అమెరికన్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ యుద్ధం తీవ్రం అవుతుందనే భయం మధ్య మార్కెట్ ఒత్తిడిని కూడా ఎదురుకొంది. కానీ ఓపెనింగ్ బెల్ మోగిన వెంటనే, కొన్ని సానుకూల సంకేతాలు వెలువడటం ప్రారంభించాయి దింతో స్టాక్ మార్కెట్ ఊపందుకోవడం కొనసాగించింది. వివిధ నిరసనలు, చర్యల తర్వాత ట్రంప్ ప్రభుత్వం తాజాగా సుంకాల ఉపశమనం గురించి సూచించింది. ఇవి ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది అలాగే షేర్స్ కొనుగోళ్లు పెరిగాయి.
ఆసియా మార్కెట్లు: ఆసియా మార్కెట్ కూడా భారత మార్కెట్ బలంగా ముందుకు సాగడానికి సహాయపడింది. జపాన్‌కు చెందిన నిక్కీ, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్, చైనాకు చెందిన ఎస్‌ఎస్‌ఇ కాంపోజిట్ ఇండెక్స్ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇవి కాకుండా కొనుగోళ్లు కూడా చాలా రోజుల తర్వాత భారత మార్కెట్‌ను గ్రీన్ లైన్‌లో ట్రేడింగ్ చేయడానికి దారితీశాయి. ప్రపంచ ఉద్రిక్తత, వాణిజ్య యుద్ధ భయం కారణంగా ప్రస్తుతానికి మార్కెట్లో అస్థిరత కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. భారతదేశం పట్ల విదేశీ పెట్టుబడిదారుల వైఖరి కూడా గతంలాగే ఉన్నప్పుడే మార్కెట్ ముందులాగే అదే వేగంతో పయనిస్తోంది. కాబట్టి, పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు అంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications